ఇండస్ట్రీ #MeToo : నాణేనికి మరో వైపు లేదా !?

సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా మహిళా ఆర్టిస్ట్ లేదా టెక్నిషియన్ ఫలానా వారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తే ప్రపంచం బద్దలైపోయినంత ప్రచారం వస్తుంది. అది సినీ ఇండస్ట్రీకి ప్రజల్లో ఉన్న గ్లామర్ కావొచ్చు.. మీడియా సంస్థల రేటింగ్స్, వ్యూస్ తాపత్రయం కావొచ్చు. దూరంగా ఏదైనా తోకలాగా కనిపిస్తే చాలు అదిగో పులి, సింహం, ఏనుగు, ఎలుగుబంటి అని కథలు అల్లినట్లుగా మీడియా అతిగా కథలు అల్లేస్తుంది. బాధలు పడేవారు పడతారు. ఆ బాధితురాలు కూడా తనకు న్యాయం జరుగుతుందా అనే భయపడేంతగా ఈ ప్రచారం ఉంటుంది. తనను ఇక ఉరి తీసేస్తారేమోనని ఆందోళన పడేలా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి మానసిక స్థితికి చేరుకుంటుంది. నిజానికి సమాజంలో జరిగే ప్రతి ఘటనలో రెండో కోణం ఉంటుంది. ఎవరికి వారు తీర్పులు చెప్పే మీడియా, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అలాంటి కోణాల గురించి ఎవరూ చెప్పుకోవడం లేదు.

జానీ మాస్టర్, ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత తెలుగు 360 ప్రతినిధికి ఓ ప్రముఖ నిర్మాత ఫోన్ చేశారు. పరిశ్రమలో జరుగుతున్న అనేక వ్యవహారాలపై తన మనసులో మాటల్ని పంచుకున్నారు. పేరు బయట పెట్టడం భావ్యం కాదు కాబట్టి.. ఆయన అభిప్రాయాలను ఇండస్ట్రీ నిర్మాతలు, ఇతర పెద్దల మనసులో మాటలుగా మనం భావించవచ్చు. ఆ నిర్మాతకు వచ్చిన మొదటి సందేహం … చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇంత సంపాదన ఎలా వస్తుంది ?

యూట్యూబ్ ఓపెన్ చేస్తే.. చిన్న చిన్న ఆర్టిస్టులు లగ్జరీ హోమ్ టూర్లతో అబ్బో అనిపిస్తూంటారు. ఇది మా స్వాంకీ కార్ అని మరొకరు హడావుడి చేస్తారు. విదేశాల్లో రీల్స్ చేస్తూంటారు. వారి లగ్జరీ లైఫ్ ను ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉంటారు. వీరికి అంత ఆదాయం ఎలా వస్తుంది ?. సాధారణంగా సినిమాల్లో రెమ్యూనరేషన్లు చిన్న ఆర్టిస్టులకు రోజు కూలీలాగా ఇస్తారు. రోజుకు పది వేల నుంచి పాతిక వేల వరకూ ఇవ్వొచ్చు. క్రేజ్ ఉన్న ఆర్టిస్టులకు అయితే వేరే. వారే ఉండాలని స్క్రిప్టులో రాసుకునేవాళ్లు వేరే కేటగిరికి..కానీ కుటుంబ సభ్యులు.. డైలాగులు ఉండని క్యారెక్టర్లు చేసే వారికి వచ్చే ఆదాయం స్వల్పం. మరి అలాంటి వారు లక్షలకు లక్షలు ఎలా సంపాదించుకుంటున్నారు ?

ఇలా అడగడంలో తప్పేమీ లేదనేది నిర్మాత భావన. ఎందుకంటే.. ఇండస్ట్రీలు తప్పులు అంటూ జరిగితే .. అందరూ బాధ్యులే. ఒకరే నీతిమంతులు అవరు. ఇలా చేయడం తప్పు అని మనం తీర్మానించలేం కూడా. వారికి చేతనైన టాలెంట్ వారు చూపించి.. వారు చేసే సేవలు వారు అందించి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఒకరిది తప్పు.. మరొకరిది ఒప్పు అని తేల్చే వాళ్లు ఎవరూ లేరు. ఒకరి కోణంలో అది తప్పు అయితే మరోకరి కోణంలో అది ఒప్పు అవుతుంది. అయితే ఇక్కడ అసలు నిర్మాత వ్యక్తం చేసిన అతి పెద్ద ఆందోళనకరమైన అంశం ఏమిటంటే.. ఎప్పుడో జరిగిందని ఇప్పుడు బయట పెట్టడం. ఇప్పుడు ఆరోపణలు చేయడం. అప్పట్లో పెద్దగా తప్పు అనిపించనిది ఇప్పుడు ఎందుకు తప్పు అనిపించి.. కనీస సాక్ష్యం లేకపోయినా బయట పెట్టి పరువు తీస్తున్నారు ? అప్పట్లో పరస్పర ప్రయోజనం ఉంది సైలెంట్ గా ఉన్నారనేది ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్. అయితే ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్లుగా మరో కోణం ఉంది… అదే కెరీర్ భయం. ఇండస్ట్రీ భరోసా ఇవ్వలేకపోవడం.

Read Also :జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

ఇప్పుడు జరుగుతున్న ఇష్యూనే తీసుకుంటే .. జానీ మాస్టర్ వద్ద ఆ అసిస్టెంట్ మైనర్ గా ఉన్నప్పటి నుంచి పని చేస్తోందని ప్రెస్ మీట్ పెట్టిన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు చెప్పారు. ఇన్నేళ్ల పాటు ఆమె కానీ .. ఆమె కుటుంబసభ్యులు కానీ ఎందుకు బయటకు రాలేకపోయారు ?. అంటే ఇండస్ట్రీ దైర్యం ఇవ్వలేదనా ?. ఈ విషయంలో ఇండస్ట్రీది కూడా తప్పు ఉంది. ఈ వ్యవహారం సంచలనం అయిన తర్వాత పూనం కౌర్ కూడా ఓ ట్వీట్ పెట్టారు. నేరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఆరోపణలు చేశారు. ఇప్పుడు చేయడం కాదు. తాను వేధింపులు ఎదుర్కొన్నప్పుడే తాను సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లానని పూనం కౌర్ చెప్పారు. మరి అప్పుడెందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టి.. చెప్పలేదు ?. పూనం కౌర్ మీడియా ముందుకు రాలేదు.. న్యాయం చేస్తారని పెద్దలకు చెప్పారు. కానీ వారు చేయలేదు. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ముందుగా ఆమె ఇండస్ట్రీలోని పెద్దల్ని ఆశ్రయించే ఉంటారు. ఎందుకు న్యాయం చేయలేకపోయారు ?. చేసి ఉంటే ఇష్యూ ఇక్కడి వరకూ వచ్చేది కాదు కదా !

సినీ నిర్మాతలు పెట్టిన ప్రెస్ మీట్‌లో గతంలో కొన్ని ఫేక్ కంప్లయింట్లు వచ్చాయని స్వయంగా బయట పెట్టారు. ఇది మహిళా ఆర్టిస్టులే.. తమకు అవకాశాలు ఇవ్వలేదని.. లేకపోతే మరో విధమైన సర్వీస్ అందించినా ప్రతిఫలం ఇవ్వలేదని కోపంతో ఫిర్యాదు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఇతర ఇండస్ట్రీల్లో కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఖడ్గం సినిమాలో సంగీత క్యారెక్టర్ ను దర్శకుడు తన దృష్టిలో ఉన్న వారిని బట్టే చూపించి ఉంటారు. నిజానికి అది సహజమైన విషయం అని..ఇండస్ట్రీలో తిరిగే ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి సమస్య ఎక్కడ వస్తుంది ?. సమస్య వెల్లడయినప్పుడు .. అంతా ఒక వైపు చూస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే నిందించడం వల్ల వస్తోంది. ఒక వేళ జానీ మాస్టర్ పై తాను ఆవేశంలో…కోపంలో తప్పుడు ఫిర్యాదు చేశానని ఆమె వెనక్కి తగ్గిదే ?. తగ్గవచ్చు కూడా. ఎందుకంటే.. జానీ మాస్టర్ దగ్గర ఆమె చాలా కాలంగా ఉన్నారు. గురుశిష్యుల్లా వారు చేసిన డాన్స్ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ తరహా ఘటనలు సినీ ఇండస్ట్రీలోనే వైరల్ అవుతాయి. కానీ అన్ని చోట్లా ఉంటాయి. ఇటీవల ఓ వయసు అయిపోయిన ఎమ్మెల్యే..ఓ మహిళతో శృంగారం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి . వాటిని ఆమే బయట పెట్టింది. పోలీసులు ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి.. ఆ మహిళను వైద్య పరీక్షలకు రమ్మంటే వచ్చేందుకు నిరాకరించింది. మరి ఈ ఘటనను ఎలా అర్థం చేసుకోవాలి ?. ఆ ఎమ్మెల్యే బలవంతం చేసినట్లుగా వీడియోలో లేదు. దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి చెప్పినట్లుగా అడల్టరీ నేరం కాదు. రేపు దివ్వెల మాధురీ కూడా వీడియోలు బయట పెట్టి.. దువ్వాడ శ్రీను రేప్ చేశాడంటే ఎలా స్పందిస్తారు ? జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగిందో పోలీసులు తేల్చేస్తారు. ఆయన తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తారు. కానీ.. ఇదే అదనుగా… బ్లాక్ మెయిలింగ్ బ్యాచులు రంగంలోకి దిగితే ఎవరికీ న్యాయం జరగదు సరి కదా.. ఇండస్ట్రీ నవ్వుల పాలవుతుంది.

అందుకే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రెండు కోణాల్లోనూ ఆలోచించాలని.. రెండు కోణాల్లోనూ న్యాయ, అన్యాయాలను పరిశీలించాలని ఆ తర్వాతే .. నిందలో.. అపనిందలో వేయాలని ఆ నిర్మాత మనసులో మాట. అది నిజమే కానీ.. మహిళా పక్షపాత ప్రపంచంలో ఇండస్ట్రీ పెద్దలే కాదు.. ఇతరులు కూడా ధైర్యం చేయలేకపోతున్నారనేది ఆయన వేదన.. ఆవేదన

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కిల్’ రీమేక్‌: ఏ స్టూడియోస్ + ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌

బాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని అందుకొన్న సినిమా 'కిల్‌'. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తార‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌డా బ‌డా నిర్మాణ సంస్థ‌లు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి....

ఎక్స్‌క్లూజీవ్‌: గ‌ప్ చుప్ గా ప్ర‌భాస్ సినిమా

ప్ర‌భాస్ - హ‌ను రాఘ‌వ‌పూడి కాంబోలో ఓ సినిమా ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బుధ‌వారం నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది....

నాగ‌బాబు ట్వీట్… జానీ మాస్ట‌ర్ ఇష్యూ మీదేనా?

జ‌న‌సేన నేత‌, ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ పై లైంగిక ఆరోప‌ణ‌లు రాగా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప‌రారీలో ఉన్న జానీ మాస్ట‌ర్ ను సైబ‌రాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ...

జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీఆర్ఎస్ రెడీ!

దేశ‌వ్యాప్తంగా జ‌మిలి ఎన్నిక‌ల చ‌ర్చ ఊపందుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం జ‌మిలీ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేప‌థ్యంలో... అన్ని పార్టీలు సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చిస్తున్నాయి. లోక్ స‌భ‌తో పాటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీల‌కు ఒకేసారి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close