ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ప్రజలకు కనీస అవసరాలు అయిన రోడ్లు కూడా ఉండవు.. వాటిని అడిగితే.. పథకాలు ఆపేస్తే రోడ్లు వస్తాయని వైసీపీ నేతలు చెబుతూంటారు.. కానీ రాష్ట్ర ప్రజల సంపద అయిన సహజవనరుల్ని మాత్రం ఇతర రాష్ట్రాలప్రజలు వచ్చి కొల్లగొట్టి తీసుకుపోతూంటారు. ఆ వనరుల్ని కొల్లగొట్టడానికి వచ్చే వారు కూడా ఇతర రాష్ట్రాల వారే ఉంటున్నారు. వారి కింద కూలీ పనులు చేయడానికి మాత్రం ఏపీ వాసులు ఉంటున్నారు. మన సంపదను దోచుకోవడానికి కూలీలుగా ఏపీ వాళ్లను పెడుతున్నారు…సంపద మాత్రం తరలి పోతోంది.
ఇసుక, ఖనిజాలు, మైనింగ్, బీచ్ శాండ్ ఇలా ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఎక్కడెక్కడి కంపెనీలో తెరపైకి వస్తున్నాయి. వాటికి అసలు అనుభవమే ఉండదు. అయినా వాటి పేరుతో కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారు. వారికి కాంట్రాక్టులు ఇస్తారని.. వస్తాయని ముందుగానే తెలుసు… పెద్ద ఎత్తున తవ్వకాలకు రంగంలోకి దిగిపోతున్నారు. టెండర్లు ఖరారు చేయక ముందే దోచుకుంటున్నారు. టెండర్లు ఉత్తుత్తి ప్రక్రియగా మారిపోయింది. టెండర్లలో కలకత్తాలో వస్తారు. హైదరాబాద్, చెన్నై కంపెనీలకు టెండర్లు దక్కుతాయి. పేర్లు మాత్రం వారివి. దోపిడీ మాత్రం… అసలు దొంగలది.
జేపీ సంస్థ పేరుతో రెండేళ్ల పాటు ఇసుకను తోడేశారు. యాభై వేల కోట్ల మేర అక్రమాలు చేశారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు దక్కడం లేదు. ఇతర రాష్ట్రాలకు తరలి పోతోంది. సంపద కూడా అంతే. ఆ సంపదను తవ్వి తీసే కూలీలు మాత్రం రాష్ట్ర ప్రజలు ఉంటున్నారు. ఇంత ఘోరమైన దోపిడీ కళ్ల ముందు కనిపిస్తున్నా వ్యవస్థలు చేష్టలుడిగా చూస్తున్నాయి. ఏమీ చేయలేని దుస్థితికి వెళ్లిపోయాయి.
తప్పుడు పనులు చేయడానికి అంగీకరించిన వారికి మాత్రమే పోస్టింగ్ లు వస్తున్నాయి. నిజాయితీగా ఉండాలంటే కేసులపాలై ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిందే. ఘోరమైన పనులకు పాల్పడుతున్న ఇలాంటి సర్కార్ ను … ప్రజాస్వామ్య దేశంలో మరొకదాన్ని చూడలేమేమోనని సెటైర్లు వినిపిస్తున్నాయి.