విడుదలకు సిద్ధమై, లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన చిత్రాలపై ఓటీటీ వేదికలు దృష్టి పెట్టాయి. ఫ్యాన్సీ రేట్లు ఎరచూపి సినిమాల్ని కొనేయాలని ఫిక్సయ్యాయి. కొన్ని చిన్న సినిమాలు ఇప్పటికే ఓటీటీ గ్రిప్పులోకి వెళ్లిపోయినట్టు సమాచారం. `వి` సినిమాకీ మంచి ఆఫర్ దొరికింది. అమేజాన్ ఈ సినిమాకి 35 కోట్లు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. రూ.35 కోట్లంటే టెమ్టింగ్ ఫిగరే. టేబుల్ ప్రాఫిట్టుతో సినిమా బయటపడిపోతుంది. దిల్ రాజుకి లాభాలే కావాలనుకుంటే ఈ సినిమాని అమ్ముకోవొచ్చు. కానీ.. ఆయన ముగ్గుర్ని ఒప్పించాల్సివుంది. నాని, సుధీర్‌బాబు, ఇంద్రగంటి మోహన కృష్ణ లు ఓటీటీ రిలీజ్‌కి ఏమంటారో అన్న సందేహం ఉంది. పైగా వి లాంటి సినిమా ఎప్పుడు వచ్చినా జనాలు చూస్తారులే అన్నది దిల్ రాజు నమ్మకం. ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది. థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే తమ ఇమేజ్ కి భంగం కలుగుతుందని కొంతమంది హీరోలు భయపడుతున్నారు. అందుకే వాళ్లెవరూ ఓటీటీ విడుదలకు ఓకే చెప్పడం లేదు. లాక్ డౌన్ మే వరకూ కొనసాగితే మాత్రం.. అందరూ ఓటీటీ వైపు దృష్టి సారించాల్సిందే. అప్పుడు ఈ ఫ్యాన్సీ రేట్లు బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే… నిర్మాతలూ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఈనెల 14న లాక్ డౌన్ ఎత్తకుండా కొనసాగితే మాత్రం.. నిర్మాతలు, హీరోలూ ఓటీటీ దారిలోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో.?