బూతు కాద‌ది.. బంగారు బాతు

ద‌ర్శ‌కుడు ర‌విబాబు ఏమాత్రం ఫామ్ లో లేడు. అవును 2, ల‌డ్డూబాబు, అదుగో… ఇలా వ‌రుస పెట్టి ఫ్లాపులే ఇచ్చాడు. ర‌విబాబు సినిమా అంటే.. `ఎలా ఉంటుందో చూద్దాం` అనే ఫీలింగ్ త‌న‌కు తానుగా పోగొట్టుకున్నాడు. ఈ డిజాస్ట‌ర్ల వ‌ల్ల త‌న మార్కెట్ కూడా బాగా దెబ్బ‌తింది. ఈ ప‌రిస్థితుల్లో ర‌విబాబు నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా `క్ర‌ష్‌`. అడ‌ల్ట్ కామెడీతో ఈ సినిమా చేస్తున్నాన‌ని, 18 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వాళ్లే చూడాల‌ని ర‌విబాబు ముందే హింట్ ఇచ్చేశాడు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ చూస్తే.. `వామ్మో` అనుకోవాల్సిందే. డ‌బుల్ మీనింగ్ ఏంటి? సింగిల్ మీనింగ్ లోనే అన్నీ చెప్పేశాడు.

ఈమధ్య బీ గ్రేడ్ వెబ్ సిరీస్‌ల‌లో చూపిస్తున్న సీ గ్రేడ్ సెక్సీ సీన్ల‌తో ఈ టీజ‌ర్ వ‌దిలాడు. క‌చ్చితంగా ఇది యూత్ ని టార్గెట్ చేసిన సినిమా అని అర్థ‌మైపోతోంది. థియేట‌ర్‌లో విడుద‌ల చేయాలంటే సెన్సార్ అడ్డంకులు త‌ప్ప‌వు. అందుకే ఈ సినిమాని నేరుగా ఓటీటీలోనే దింపాల‌ని ప్లాన్ చేశాడు ర‌విబాబు. దానికి త‌గ్గ‌ట్టుగానే టీజ‌ర్ వ‌ద‌ల‌గానే… ఈ సినిమాకి ఆఫ‌ర్లు వ‌రుస క‌డుతున్నాయి. ఆహా, జీ 5 ఇప్ప‌టికే మంచి రేట్లు కోడ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అతి త‌క్కువ పెట్టుబ‌డితో ర‌విబాబు ఈ సినిమా ని పూర్తి చేశాడు. పెట్టుబ‌డితో పోలిస్తే.. ఇప్పుడు రెండింత‌ల లాభం వ‌స్తోంద‌ట‌. అందుకే ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాల‌ని ఫిక్స‌య్యాడు. హార‌ర్‌, థ్రిల్ల‌ర్‌, కాన్సెప్ట్ సినిమాలు.. వీటిలో లేని మైలేజీ ఈ బూతు సినిమాలో ఉంద‌న్న విష‌యం `క్ర‌ష్‌` మ‌రోసారి నిరూపించిన‌ట్టైంది. ఇది వ‌ర‌కు రవిబాబు తీసిన సినిమాలు డిజాస్ట‌ర్లు అవ్వ‌డ‌మే కాదు, ఆర్థికంగానూ న‌ష్టాలు మిగిల్చాయి. క్ర‌ష్ ఫ‌లితం ఎలా ఉన్నా – క్యాష్ మాత్రం ముందే వ‌చ్చేస్తోంది. ర‌విబాబు త‌న గోల్ ని రీచ్ అయిపోయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close