ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆక్సిజన్ కొరత ఉంది. మెట్రో నగరాలేమీ లేకపోవడం.. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మీడియాలో అక్కడి ఆస్పత్రుల పరిస్థితులు వెలుగులోకి రావడంలేదు. మంత్రి పెద్దిరెడ్డిలాంటి వాళ్లు అప్పుడప్పుడు… ఆక్సిజన్ కొరత ఉందని.. తక్షణం తెప్పిస్తున్నామని చెబుతున్నారు. అన్ని చోట్లా కొరతే కాబట్టి.. అధిగమించడానికి ప్రభుత్వం ఏ ప్రయత్నం చేస్తోందన్న ఆసక్తి ఏర్పడటం ఖాయమే. కొద్ది రోజుల కిందట.. కరోనా పాజిటివ్‌గా తేలక ముందు మంత్రి గౌతంరెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి.. ఆంధ్రప్రదేశ్‌కు అసలు ఆక్సిజన్ కొరతే లేదని.. నాలుగు విధాలుగా ఏపీకి ఆక్సిజన్ వస్తుందన్నారు.
అందులో ప్రధానంగా గౌతంరెడ్డి చెప్పిన మాట.. విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కావాల్సినంత ఆక్సిజన్ అందుతుందని ప్రకటించారు. ఆ తర్వాత .. ప్రత్యేక రైళ్లో.. ఆక్సిజన్ ట్యాంకర్లను మహారాష్ట్ర తరలించినప్పుడు.. విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా ప్రచార హంగామా చేసింది. దేశానికి ఆంధ్రా ఆక్సిజన్ అందిస్తోందని.. ప్రచారం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఒక్కటంటే ఒక్క ట్యాంకర్ ఆక్సిజన్ కూడా ఏపీకి అందడం లేదు. స్టీల్ ప్లాంట్ వంద శాతం కేంద్ర ప్రభుత్వానిదే. ఇంకా అమ్మకం కాలేదు కాబట్టి… కేంద్రం చేతుల్లోనే ఉంది. కేంద్రం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి ఎవరికి పంపించమంటే ప్లాంట్ అధికారులు వారికి పంపిస్తారు.
ఏపీకి వ్యాక్సిన్ ఎంత కేటాయించారో కానీ.. స్టీల్ ప్లాంట్ నుంచి మాత్రం ఇంత వరకూ ఒక్క ఆక్సిజన్ ట్యాంకర్ కూడా ఏపీకి అందలేదని చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ నుంచి మెడికల్ అవసరాల కోసం రోజుకు వంద టన్నుల ఆక్సిజన్‌ను పొందడానికి అవకాశం ఉంది. పొందుతున్నారు కూడా. అయినప్పటికీ.. ఏపీకి కావాల్సినంత ఆక్సిజన్ లభించడం లేదు. ప్లాంట్ మనది.. ప్రాణాలు నిలుపుతున్న ఆంధ్రా అని ప్రచారం చేసుకుంటున్న ఆంధ్రా పాలకులకు .. .ఏపీ అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను స్టీల్ ప్లాంట్ నుంచి పొంద లేకపోతున్నారు.