తెలంగాణ ప్రజలకు..చంద్రబాబును బూచిగా చూపించి.. ఆయన వస్తే.. అన్నీ ఎత్తుకెళ్లిపోతాడని.. బెదిరిస్తూ.. కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన విషయాన్ని ఓ వైపు చెబుతూనే.. మరో వైపు.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆగమాగం అయిపోయిందని చెబుతున్నారు. కారణం ఏదైనా చంద్రబాబుపై వ్యతిరేకత పెంచి.. ఆ వ్యతిరేకత ద్వారా ఓట్లు సంపాదించుకునే ప్రక్రియను.. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ వాడుకుంటున్నారు. ఇదేదో బాగుందనుకున్నారో.. లేక.. టీఆర్ఎస్ విధానమే.. తమ విధానమనుకున్నారో కానీ… బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు… కూడా ఇవే మాటలు చెబుతున్నారు.
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తూ.. ఎన్ని స్థానాల్లో డిపాజిట్లు వస్తాయో లెక్కలేసుకుంటున్న.. మురళీధర్ రావు.. టీఆర్ఎస్ పై పైపై విమర్శలు చేసి.. చంద్రబాబునే టార్గెట్ చేశారు. చంద్రబాబును తెలంగాణలోకి రానివ్వకూడద. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందట. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అట. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలట. వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలట. నిజానికి ఇవన్న టీఆర్ఎస్ డిమాండ్లు. కానీ చంద్రశేఖర్ రావు.. మురళీధర్ రావులు.. చంద్రబాబుపై వ్యతిరేత విషయంలో.. తమ వేవ్ లెంగ్త్ కలిసిందనమో.. కంబైన్డ్ గా … ఒకే రకమైన విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదట. తెలంగాణ ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారని తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలట. అప్పటికేదో… చంద్రబాబునాయుడు..తెలంగాణ సీఎం పదవి కోసం చంద్రబాబు పోటీ పడుతున్నట్లు ఆయన షివరింగ్ అయిపోతున్నారు. తెలంగాణ నేతలకు.. జాతీయ.. నేతలకు.. చంద్రబాబు ఫోబియా పట్టుకుంది. ప్రతీ దానికి చంద్రబాబు కారణంగా చెప్పుకుని.. బతికేద్దామనుకుంటున్నారు.