కేరళలో మళ్ళీ వామపక్ష ఎల్.డి.ఎఫ్. విజయం సాధించడంతో, ఎన్నికలలో దానికి సారధ్యం వహించిన మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ ఆయన వయసు (93) ఇతర కారణాల చేత ఆయనతో పోటీ పడిన పి.విజయన్ న్ని ముఖ్యమంత్రిగా ఆ పార్టీ శాసనసభ్యులు ఎన్నుకొన్నారు. ఆయన వయసు 72సం.లు.
ఇంతవరకు కేరళ ముఖ్యమంత్రిగా వ్యవహరించించిన ఊమెన్ చాంది ఇవ్వాళ్ళ ఉదయమే రాష్ట్ర గవర్నర్ ని కలిసి తన రాజీనామా పత్రం సమర్పించారు. కనుక త్వరలోనే ఆయన స్థానంలో విజయన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అచ్యుతానందన్ పార్టీని విజయపథంలో నడిపించి అధికారం కట్టబెట్టినందుకు ఆయనకు కూడా ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని ఎల్.డి.ఎఫ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.