వైఎస్ఆర్సిపి అద్యక్షుడు జగన్ పాదయాత్రకోసం సిబిఐ న్యాయస్థానం శుక్రవారం హాజరు నుంచి కొంత మినహాయింపునివ్వొచ్చు. నెల లేదా రెండు నెలలు మినహాయిస్తే దాంతో యాత్ర ప్రారంభించి తర్వాత పొడగించుకోవడానికి పోరాడవచ్చు.దీనిపై న్యాయమూర్తి ప్రశ్నలు సిబిఐ న్యాయవాది వాదనలు కూడా ఆ తరహాలోనే వున్నాయి. రెండు మూడు వారాలైతే మినహాయింపు అడగొచ్చని సిబిఐ స్వయంగా చెప్పింది.తాము మొత్తంగా కేసు హాజరు నుంచి మినహాయింపు కోరడం లేదనీ కేవలం పాదయాత్ర వరకే అడుగుతున్నామని జగన్ న్యాయవాది తెలియజేశారు. మొదట ఆ విధంగా హైకోర్టును కోరినప్పటికీ తర్వాత కింది కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడంతో ఇక్కడకు వచ్చామన్నారు. వారంలో ఒకరోజు రావడం వల్ల విశ్రాంతి లభిస్తుందని న్యాయమూర్తి అంటే యాత్ర ప్రభావం తగ్గుతుందని వీరు చెప్పారు. ఈ స్తితిలో 23న తీర్పు నిస్తామని వాయిదా వేశారు గాని బహుశా అడిగిన దానిలో కొంత మినహాయించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ లేకపోయినా హెలికాఫ్టర్లోనో మరో విధంగానే కోర్టుకు హాజరవుతూనే యాత్ర కొనసాగిస్తారని వారు గట్టిగా చెబుతున్నారు. మరో వైపున జైలుపాటలో భాగంగా గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని మరోసారి చెప్పారు. అక్రమాస్తుల కేసు విచారణకు సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ శ్రీలక్ష్మి వంటివారు కూడా హాజరైనారు. కొద్దివారాలైతే ఫర్వాలేదని సిబిఐ అంటున్నది గనక ఆ మేరకు తీసుకోవడానికి జగన్ పక్షం ప్రయత్నించవచ్చు.