ఎక్కడో హూజూరాబాద్‌లో ఎమ్మెల్యే అయితే హైదారబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో తనకు డీజీపీ కంటే ఎక్కువ ప్రోటోకాల్ ఇవ్వలేదని పోలీసులపై రుబాబుగా చేసిన పాడి కౌశిక్ రెడ్డికి… తమ అసలైన ప్రోటోకాల్ ఎలా ఉంటుందో చూపించేందుకు రెడీ అయ్యారు. పోలీసులపై పాడి కౌశిక్ రెడ్డి ఇలా రుబాబు చేయడం ఇదే మొదటి సారి కాదు. పెద్దగా పట్టించుకోవడంలేదని ఆయన ఎప్పటికప్పుడు రెచ్చిపోతూండటంతో ఈ సారి మాత్రం ప్రోటోకాల్ ఇవ్వాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది.
పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఆయన కేసులు నమోదు చేశారు. ఉదయమే ఆయనను అరెస్టు చేయడం ఖాయమమని తేలడంతో హడావుడిగా హరీష్ రావు వచ్చారు. ఆయనను కూడా ఇంట్లోకి పోనివ్వలేదు. గచ్చిబౌలి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు పై కేసు నమోదు చేసినందుకు ప్రతీకారంగానే పోలీసులపై కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. అందుకే హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చారు.
ఇవాళ పాడికౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి ప్రోటోకాల్ కల్పించడం ఖాయమని పోలీసు వర్గాలు గుసగసలాడుకుంటున్నాయి. కనీస ఆధారాల్లేకుండా పోలీసు బాసులను రాజకీయాల్లోకి తెచ్చి మరీ టార్గెట్ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు తప్ప ఇతర నేతలు మాట్లాడకపోవడం..ఆయనకు ఇబ్బందికరమే అనుకోవచ్చు.