పాడి కౌశిక్ రెడ్డి ఈ సారి తన సోషల్ మీడియా డ్రామాకోసం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ను ఎంచుకున్నారు. ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే సీఐ పారిపోయినట్లుగా ప్రచారం చేసేశారు. కావాలనుకుంటే పాడి కౌశిక్ రెడ్డిని తరిమికొడతారు కానీ.. వారు ఎందుకు పారిపోతారనే చిన్న లాజిక్‌ను కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా టీం మర్చిపోయింది. అది ఆయనను కొన్ని కేసులలో ఇరికించే అవకాశం కనిపిస్తోంది.
హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ట్యాపింగ్ కేసు పెట్టడంతో పాడి కౌశిక్ రెడ్డికి కోపం వచ్చింది. ఇప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ శివిర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వస్తున్నానని ఎస్ఐకి ఫోన్ చేసి.. వచ్చారు. తన ఫిర్యాదు ఇవ్వడానికి పెద్ద ఎత్తున అనుచరులతో వచ్చాడు. సీఐ వచ్చేటప్పటికి ఆయనతో పాటు అందరూ లోపలికి దూసుకెళ్లారు. ఫిర్యాదు ఇచ్చే పేరుతో ఆయన హంగామా చేశారు.
ఫిర్యాదు ఇవ్వడానికి ఓ పద్దతి ఉంటుంది. తన ఫిర్యాదు సీఐనేతీసుకోవాలని.. ఇంటలిజెన్స్ చీఫ్ పై ఇచ్చే ఫిర్యాదును నవ్వుతూ స్వీకరించాలి లాంటి కండిషన్లు పెట్టి రాజకీయం చేయాలనుకున్నారు. ఆయన పని మీద బయటకు వెళ్తూంటే.. వీడియోలు తీసి.. పారిపోయాడని ప్రచారం చేశారు.హరీష్ రావుపై కేసు ఏమో కానీ.. పోలీసులకు పాడి కౌశిక్ రెడ్డి ఈ విషయంలో టార్గెట్ అయ్యేలా ఉన్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.