సాధారణంగా సెట్లో హీరోల డామినేషనే కనిపిస్తుంటుంది. మహా అయితే.. స్టార్ డైరెక్టర్లు తమ హవా చూపిస్తుంటారు. కథానాయిక డామినేషన్ అనేది చాలా తక్కువ. కానీ.. కేరళ కుట్టీలు మాత్రం సెట్లో చాలా కమాండింగ్‌గా ఉంటుంటారట. సాయి పల్లవి అందుకు పెద్ద ఉదాహరణ. తెలుగులో సాయి పల్లవి చేసింది తక్కువ సినిమాలే. కాకపోతే.. హీరోలపై డామినేషన్ ఎక్కువ చేస్తుందని, ”నా పాత్ర పరిధి ఎక్కువ ఉండాలి” అని షరతులు పెడుతుందని, సెట్లో చుక్కలు చూపిస్తుంటుందని.. రకరకాల రూమర్లు. ‘కణం’ సమయంలో నాగ శౌర్య కూడా సాయి పల్లవిపై భయంకరమైన కామెంట్లు చేశాడు. సెట్లో తన ఆధిపత్యమే ఎక్కువ ఉంటుందని మీడియా ముఖంగా విమర్శించాడు. దాంతో సాయి పల్లవిపై వచ్చినవి రూమర్లు కావని, నిజాలే అని అర్థమయ్యాయి.
అయితే ఇప్పుడు సాయి పల్లవి పూర్తిగా మారిపోయిందట. తన పనేదో తాను చూసుకుని సైలెంట్‌గా వెళ్లిపోతోందట. ప్రస్తుతం శర్వానంద్‌తో `పడి పడి లేచె మనసు`లో నటిస్తోంది సాయి పల్లవి. సెట్లో తన ప్రవర్తన పూర్తిగా మారిందని, డామినేషన్ అనే మాటే కనిపించడం లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ”మేం కూడా సాయి పల్లవి డామినేట్ చేస్తుందన్న మాటలు విన్నాం. కానీ.. మా సెట్లో అలా జరగడం లేదు. తను చాలా కూల్..” అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ‘కణం’ ఎఫెక్ట్, శర్వా స్టేట్మెంట్లు సాయి పల్లవిపై బాగానే ప్రభావం చూపించాయన్నమాట.