ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మొత్తం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించింది. 91 మందికి పద్మశ్రీ, 9 మందికి పద్మభూషణ్, ఆరుగురికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ :
మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి – ఆర్ట్
గణేష్ నాగప్ప – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
సివి రాజు- ఆర్ట్స్
అబ్బా రెడ్డి నాగేశ్వరరావు – సైన్స్ అండ్ ఇంజనీరింగ్
కోట సచ్చిదానంద శాస్త్రి- ఆర్ట్
సంకురాత్రి చంద్రశేఖర్ – సోషల్ వర్క్
ప్రకాష్ చంద్ర సూదు – లిటరేచర్
తెలంగాణ :
మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం
హనుమంతరావు పసుపులేటి(వైద్యం),
బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య)
అలాగే తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితో పాటు ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రముఖ గాయని వాణి జయరాం కు తమిళనాడు నుంచి పద్మభూషణ్ అవార్డ్ కు ఎంపికయ్యారు.