వాళ్లంతా ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ జగన్ రెడ్డి వైనాట్ 175 నినాదాలకు కోరస్ పలికేవాళ్లు. వాళ్ల ఎలివేషన్లు ఎలా ఉండేవంటే… ప్రజాగ్రహం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా.. జగన్ ఏదో మ్యాజిక్ చేస్తున్నారని చాలా మంది నమ్మేసేవాళ్లు. ఇప్పుడు వాళ్లంతా జగన్ కు ఎందుకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అని వాదిస్తున్నారు. ఈ వేరియేషన్ గుర్తు చేసుకున్న వారికి చాలా కామెడీగా అనిపిస్తుంది కానీ ఆ మేధావులకు మాత్రం కాదు. ఎక్కడ వైనాట్ 175 ఎక్కడ… ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వాలని వాదించడం.
జగన్ రెడ్డి ఓడిపోతాడని అనుకోని వాళ్లు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా రాదని ఊహించలేకపోయారు. మొదట సైలెంట్ అయిపోయారు. జగన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత రాజ్యాంగం ఇస్తుందని ఓ లేఖ రాసిన రోజు నుంచి అదే వాదనను మీడియా చానళ్లలో వినిపించడానికి వస్తున్నారు. వారంతా తాము అనుకున్నదే చెబుతున్నారు కానీ… చట్టాల్లో.. రాజ్యాంగాల్లో… సభా సంప్రదాయాల్లో ఏముందో చెప్పడం లేదు. అంతకు ముందు గతంలో జగన్ రెడ్డి చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదా తీసేస్తానన్న మాటల్ని కూడా తెలియనట్లుగా ఉంటున్నారు.
ఇలాంటి మేధావుల్లో నాగేశ్వర్ కూడా ఒకరు. ఆయనే సారధ్యంలోనే మిగతా వారు నడుస్తున్నారని అనుకోవచ్చు. కాంగ్రెస్ కు గత రెంటు టర్ముల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. చట్టంలో లేకపోతే కాంగ్రెస్ ఎందుకు ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయింది అన్న చిన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. గుర్తించనా తమ విలువకు తగ్గట్లుగా వాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.