‘అన్నా… రెండు బాల్కనీ టికెట్లు కావాలి’ అంటూ టీజర్లోనే తన ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించాడు బాలకృష్ణ. ఇప్పుడు ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్లో బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అనే విషయం క్లారిటీగా చెప్పేశాడు. ‘నా పేరు తేడా సింగ్. ధిమాక్ తోడా. చాలా తేడా` అంటూ బాలయ్య తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకొన్నాడు. ”గొడవల్లో గోల్డ్ మెడల్ వచ్చినోడ్ని.. మళ్ళీ టోర్నమెంట్స్ పెట్టొద్దు” అంటూ పూరి తనదైన శైలిలో డైలాగులు రాస్తే.. బాలయ్య రెచ్చిపోయి మరీ పలికాడు. పూరి తన సినిమాల్లో హీరో ని ఎప్పుడూ ఓ ఇడియట్‌లా చూపిస్తుంటాడు. ఈసారి ఆ డోస్ మరీ ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకే ‘నువ్వేంట్రా ఇలా ఉన్నావ్’ అంటూ విలన్ చేతే పలికించాడు. ఫక్తు మాస్ మసాలా కమర్షియల్ పైసా వసూల్ సినిమాలా కనిపిస్తోంది పైసా వసూల్. పూరి స్టైల్ ఆఫ్ టేకింగ్, డైలాగులకు, బాలయ్య వీర పెర్‌ఫార్మ్సెన్స్ తోడైనట్టు అనిపిస్తోంది. ట్రైలర్ వరకూ చూస్తే.. ‘పైసా వసూల్’ అనే పేరుకి జస్టిఫికేషన్ జరిగిపోయింది. అయితే బాలయ్య ప్రతీ డైలాగ్‌నీ అరుస్తూ చెప్పడం, ఆ గొంతులో జీర రావడం, కాస్త షేక్ అయినట్టు అనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కావాలని డబ్బింగ్ అలా చెప్పించాడా, లేదంటే సినిమా మొత్తం డైలాగులు ఇలానే ఉండబోతున్నాయా? అనే ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఓ కొత్త బాలయ్యని చూస్తున్నాం అని ఫిక్సయిపోయి థియేటర్లకు వెళ్లొచ్చు. ఆ విషయంలో ఎలాంటి ఢోకా లేదు.