పాకిస్తాన్ రాజకీయ నాయకులు గీత దాటి పోతున్నారు. అరిచే కుక్క కరవదన్న సామెత వారి దగ్గర ఉందో లేదో కానీ అరిచేవాళ్లు ఎక్కువైపోతున్నారు. తమ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని అవన్నీ భారత్ కోసమేనని కొంత మంది ప్రకటనలు చేస్తున్నారు. నిజంగా పాకిస్తాన్ వద్ద అణుఆయుధాలు ఉన్నాయో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే భారత్ అణుపరీక్షలు చేసినప్పుడు .. పాకిస్తాన్ కూడా చేసింది. పాకిస్తాన్ చేసిందని చెప్పడం కన్నా..చైనా పాకిస్తాన్ పేరుతో చేసిందని అనుకోవచ్చు.
అంటే చైనా అణ్వాయుధాలే పాకిస్తాన్ వద్ద ఉంటాయి. అప్పట్నుంచి తమది అణ్వస్త్రదేశమేనని పాకిస్తాన్ చెప్పుకుంటోంది. కానీ సొంతంగా ఒక్క మందుగుండు సామాగ్రి కూడా తయారు చేసుకోలేని పాకిస్తాన్ ఇలా అణు ఆయుధాలను రెడీ చేసుకుంటుందని అనుకోవడం లేదు. ఉత్తుత్తి బాంబుల్ని చూపించి భయపెట్టాలని అనుకుంటోంది. కానీ భారత్ వద్ద అంత కంటే శక్తివంతమైన అణుసామర్థ్యం ఉంది. ఆ విషయం పాకిస్తాన్ నేతలకూ తెలుసు. భారత్ కోసమే తమ వద్ద అణు అస్త్రాలు అని చెబుతున్నారు కానీ.. మరి భారత్ దీపావళి సమయంలో పేల్చుకోవడానికి కాదుగా.. భారత్ దగ్గర ఉన్న వారికి యుద్ధం ఎవరు చేస్తే వారిపై వాడటానికే.
ఇప్పుడు అణు బాంబుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కానీ.. పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశాల వల్లనే ఎక్కువగా నష్టం జరుగుతోంది. తమ దేశంలో ప్రజల బతుకుల్ని..బాగు చేయడానికి ప్రయత్నించకుండా.. పక్క దేశంలో తమ జీవనాడి అంటూ రెచ్చిపోతున్నారు. ఆకలితో అలమటించే దేశం ఇలా చేయడం వల్ల ఎవరికి నష్టం.. తమ పౌరుల్ని ఇప్పటికే ఉగ్రవాద పంజాలోకి నెట్టి తాము మాత్రం.. ఇలాంటి యుద్ధ రాజకీయాలు చేస్తున్నారు పాకిస్తాన్ పాలకులు.