పహల్గం ఉగ్రదాడితో భారత్ తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సింధు నదీ జలాల ఒప్పందాల రద్దు, సార్క్ వీసాల కింద భారత్ లో ఉన్న వాళ్లు 48గంటల్లో పాక్ వెళ్లిపోవాలని , హైకమిషన్ లో దౌత్య సిబ్బంది 30కి తగ్గించడం వంటి నిర్ణయాలు పాక్ కు దిమ్మతిరిగేలా చేశాయి. వీటిపై ఎలా స్పందించాలో తెలియక ఇండియా నిర్ణయాలను కాపీ కొట్టి పాక్ నవ్వుల పాలౌతోంది.
పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు సమావేశం అయ్యారు. భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందోనని ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
కానీ, భారత్ తీసుకున్న నిర్ణయాలను పాకిస్తాన్ కాపీ కొట్టింది. సార్క్ వీసా ద్వారా పాక్ లో పర్యటిస్తున్న ఇండియన్స్ అనుమతులను రద్దు చేసింది. పాక్ లోని హైకమిషన్ కార్యాలయంలోని భారత దౌత్య సిబ్బందిని 30కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు నిర్ణయాలు భారత్ నుంచే కాపీ కొట్టింది పాక్. ఇక , భారత్ అటారీ బోర్డర్ ను మూసివేయాలని నిర్ణయిస్తే.. వాఘా బోర్డర్ ను మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది.