పాకిస్తాన్ కి చెందిన పాక్ కోబ్రా ఆర్మీ హ్యాకర్స్ ఇండియన్ రెవెన్యూ సర్వీసస్ తో సహా మరో ఐదు ప్రభుత్వ వెబ్ సైట్లను శనివారం హ్యాక్ చేశారు. అలాగే యోగి వేమన విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైటును కూడా హ్యాక్ చేసారు. హ్యాక్ చేసి వాటిలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ ‘దిస్ వెబ్ సియట్ ఈజ్ హ్యాక్డ్ బి పాక్ కోబ్రా ఆర్మీ’ వంటి సందేశాలు పెట్టారు. ఈ విషయం గమనించిన సంబంధిత శాఖల అధికారులు తక్షణమే నిపుణుల చేత ఆ సమస్యని సరి చేయించడంతో మళ్ళీ వెబ్ సైట్లు యధావిధిగా పనిచేస్తున్నాయి. పాకిస్తాన్ హ్యాకర్స్ ప్రభుత్వ వెబ్ సైట్లలో నుండి సమాచారం ఏమయినా తస్కరించారా లేదా అనే విషయం తెలియదు. యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించినంత వరకు వెబ్ సైట్ లో ఎటువంటి సమాచారం పోలేదని మాత్రం నిర్ధారణ అయింది.