బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ సోషల్ మీడియాను.. దున్ని పడేస్తున్నాయి. మీమ్స్, వీడియోలు హోరెత్తి పోతున్నాయి. క్రియేటివ్ ఐడియాస్తో.. అందరూ చెలరేగిపోతున్నారు. ఆదివారం రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి.. కరోనా వైరస్ గురించి చెప్పారు. ప్రపంచమంతా హడలి పోతుంటే ఆయన మాత్రం… “ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్” అని తేల్చేసారు. అయితే ఈ మధ్యలో.. ఇబ్బంది పడకుండా.. రెండు రకాల మెడికేషన్లు సూచించారు. అందులో ఒకటి.. పారాసిటమాల్ టాబ్లెట్ వాడటం. కరోనా వస్తే.. ఆ టాబ్లెట్ నయమవుతుంది. అదే సమయంలో కరోనా దరిదాపుల్లో రాకుండా ఉండటానికి.. బ్లీచింగ్ పౌడర్ టెక్నిక్ చెప్పారు. ఎక్కడైనా కరోనా వైరస్ ఉందనుకుంటే.. దాని మీద బ్లీచింగ్ పౌడర్ చల్లితే తొమ్మిది గంటల్లో చచ్చిపోతుందన్నారు. ఇవి.. జాతీయ.. అంతర్జాతీయంగా హైలెట్ అయిపోయాయి. లోకల్‌గా పొలిటికల్ మీమ్స్ తయారు చేసే వారికి.. జగన్మోహన్ రెడ్డి చాలా పని పెట్టారు.
పాత తెలుగు సినిమాల నుంచి.. కొత్తగా… సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణా .. లోడెత్తాలిరా డైలాగ్ వరకూ.. ఎన్ని మ్యాచ్ అయితే.. అన్నింటిలోనూ… ఈ బ్లీచింగ్ పౌడర్ .. పారాసిటమాల్ ను హైలెట్ చేశారు. ఇక వీడియో మీమ్స్ కూడా లెక్క లేనన్ని వచ్చేశాయి. ముఖ్యంగా గుడుంబా శంకర్ తో పాటు.. మరో సినిమాలో బ్రహ్మానందం స్వామిజీ వేషంలో.. భక్తుల నోట్లో విభూతి కొట్టే సీన్లను తీసుకుని.. బ్రహ్మిని జగన్ గా… భ క్తుల్ని ఏపీ ప్రజలుగా చూపిస్తే.. బూడిదను.. బ్లీచింగ్ గా ప్రజెంట్ చేస్తున్నారు. జగన్ ప్రజల నోట్లో బ్లీచింగ్ కొట్టి కరోనా రాకుండా చేస్తున్నారని.. సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటివి చాలా వీడియోలు.. సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అదే సమయంలో.. జాతీయ.. అంతర్జాతీయ మీడియా కూడా… జగన్మోహన్ రెడ్డి జ్ఞానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
ప్రాణాంతక వైరస్ ను ఎదుర్కొనే విషయంలో రాజకీయ నేతలు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారని.. జాతీయ మీడియా.. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను చూపి మండిపడింది. పాకిస్తాన్ లోని ది న్యూస్ అనే ఇంగ్లిష్ దినపత్రిక… ఇండియాలో ముఖ్యమంత్రులు ఇంత అజ్ఞానంతో ఉంటారని చెప్పుకునేందుకు.. జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ను హైలెట్ చేసింది. మూడు రోజులు ముగిసినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ వేవ్ మాత్రం సోషల్ మీడియాలో తగ్గడం లేదు. అంతకంతకూ.. లోకల్ నుంచి నేషనల్.. ఇంటర్నేషనల్ అయిపోయింది.