ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్ రేసులో దాదాపు తప్పుకుంది. గ్రూప్-ఎలో ఉన్న పాక్ తొలుత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. తాజాగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ టోర్నీ లో పాక్ భవితవ్యం సంగతి పక్కన పెడితే.. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే యమా క్రేజ్ వేరు. కానీ ప్రస్తుత పాక్ టీం పేలవ ప్రదర్శన ఆ మజాని ఇవ్వలేదు. నిన్నటి మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఇండియా వంద పరుగులకు చేరుకోగానే పాక్ అభిమానులు స్టేడియం ని వీడారు.అసలు తమ జట్టు ఇంత పేలవంగా ఆడుతుందని తాము ఊహించలేదని నిట్టూర్చారు.
ఒకప్పటి పాక్ టీంకి ఇప్పటి టీంకి అసలు పొంతన లేదు. ఐసిసి లాంటి బిగ్ మ్యాచ్ లో ఆడుతున్న ఫీలింగే రాలేదు. ఏదైనా సమవుజ్జీలు వుంటేనే మజా. కానీ పాక్ ప్రస్తుతం మ్యాచ్ విన్నర్స్ కొరతతో ఇబ్బంది పడుతుంది. ఒకప్పుడు టీంలో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ వుండేవారు. ఆచితూచి ఆడేవారు. మ్యాచ్ ని చివరి వరకూ తీసుకెళ్ళి టఫ్ ఫైట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడా జట్టు పేలవంగా కనిపిస్తుంది. ఇండియా జట్టు ముందు కూర్పులోనే ఆ జట్టు తేలిపోయింది.
ఇప్పటికే పాక్ మాజీలు ఆ జట్టుని ఏకిపారేస్తున్నారు. ఒక ప్లాన్ పద్దతి లేదని విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ట్యాలెంట్ పరంగా చూస్తుంటే ఇండియా ముందు ఆ జట్టుపనికి రాదు. కానీ బెస్ట్ ప్లేయర్స్ ని ఎంచుకునే అవకాశం మ్యానేజ్మెంట్ కి వుంది. కానీ జట్టు కూర్పులో కూడా పస లేదు. బాబర్ అజామ్, రిజ్వాన్ పై బ్యాటింగ్ భారం పెట్టేస్తున్నారు. మిగతా ప్లేయర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడుతారో క్లారిటీ లేదు.
బౌలింగ్ లో షాహిన్, రావుఫ్ మీదే ఆశలు. వాళ్ళ బంతుల్లో మెరపులు లేవు. ఆ జట్టుకి సరైన స్పిన్నర్ లేడు. దుబాయి లాంటి వేదికల్లో కూడా ఫాస్ట్ ని నమ్ముకున్నారు. ఇదంతా ప్లానింగ్ లేకపోవడం. పాక్ ఇదే జట్టు ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మాత్రం.. ఇండియా పాక్ మ్యాచ్ అంటే వార్ వన్ సైడ్ అనే ఫీలింగ్ వచ్చి ఆ మ్యాచులకి క్రేజ్ మసకబారిపోవడం ఖాయం.