పాకిస్తాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం టెర్రరిజం. ఆ దేశంలో ఎప్పుడు బాంబు దాడులు జరుగుతాయో.. ఓ ఏ మూల తాలిబన్లు, బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాట ఉగ్రవాదులు దాడులు చేస్తారో తెలియదు. ఆప్ఘన్ వైపు నుంచి.. బలూచిస్తాన్ వైపు నుంచి ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. రాజకీయ ర్యాలీల బాంబుదాడులు సహజంగా మారిపోతూంటాయి. దీనంతటికి కారణం పాకిస్తాన్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడమే. తమ దేశం టెర్రరిస్టుల స్వర్గధామంగా మారిపోవడానికి అక్కడి పాలకులు,సైన్యమే కారణం. తమ ఇల్లు తగలబడిపోతున్నా వారు పట్టించుకోకుండా పక్కింటికి నిప్పు అంటించాలని చూస్తున్నారు.
పాకిస్తాన్ ను సగం నాశనం చేసిన తాలిబన్లు
తాలిబన్లకు ఒకప్పుడు పాకిస్తాన్ సాయం చేసింది. వారు ఇప్పుడు ఏకు మేకులయ్యారు. పాకిస్తాన్ పై తాలిబన్లు యుద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ ను కబ్జా చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో వారిని ఆపడానికి యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరికి పాకిస్తాన్ లో ఉన్న ఆప్ఘన్ వాళ్లంతా తాలిబన్లే అనుకుని దేశం నుంచి పంపేసింది. అధికారిక పత్రాలతో ఉన్న వారందర్నీ పంపేసింది. కానీ అనధికారికంగా వేల మంది ఆఫ్ఘనిస్తాన్ వాసులు పాకిస్తాన్లో ఉన్నారు. కొన్ని ప్రాంతాలపై పట్టు సాధించారు కూడా. వారిని పాకిస్తాన్ సైన్యం ఏమీ చేయలేకపోతోంది.
పాకిస్తాన్ నుంచి విడిపోనున్న బలూచిస్తాన్
ఇక బలూచిస్తాన్ ఉగ్రవాదుల గురించి చెప్పాల్సిన పని లేదు. బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా చేయాలని వారు పోరాడుతున్నారు. ఇటీవల ట్రైన్ ను హైజాక్ చేసి పేల్చివేశారు. అలాంటివి అంతకు ముందు కూడా చేశారు. పాకిస్తాన్ సైన్యం, పాలకులు ఆ ప్రాంతంపై చూపించే వివక్ష కారణంగా కొన్నాళ్లకు అయినా బలూచిస్తాన్ విడిపోక తప్పదు. తమ ప్రయోజనాలకు ఆటంకం ఏర్పడుతుందని అనుకుంటే చైనానే ఉగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి పని పూర్తి చేసుకుంటుంది.
కొంపకు నిప్పు ఆర్పుకోక ఇండియాపై పాక్ కుట్రలు
కశ్మీర్ ను మర్చిపోయేది లేదంటూ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ఉగ్రదాడి జరిగింది. తమ దేశంలో ఉన్న ఘోరమైన పరిస్థితుల్ని సరిదిద్దుకోలేక భారత్ పై కుట్రలు చేయడం ప్రారంభించారు. ఉగ్రవాదం కారణంగానే పాకిస్తాన్ అల్లకల్లోలం అయి దేశంలో ఎవరికీ కాకుండా పోయింది. ఎవరైనా ఆ దేశం వెళ్లాలంటే భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇండియాపై కుట్రలు చేస్తోంది. ఇక పాకిస్తాన్ పై జాలి చూపించాల్సిన అవసరం ఉంటుందా?