భారత్‌లోకి ఉగ్రవాదుల్ని పంపుతున్న పాకిస్తాన్ పై మోదీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ చేసి బుద్ది చెప్పింది. తాము పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని స్వయంగా ప్రకటించింది . అయితే పాకిస్తాన్ దాడులు జరగలేదని చెప్పుకుంది. ఎందుకంటే.. దాడులు జరిగాయంటే తాము టెర్రరిస్టుల్ని ప్రోత్సహించామన్న ప్రచారం జరుగుతుందని సైలెంట్ అయిపోయింది. భారత్ ప్లాన్ ను కాపీ కొట్టిన పాకిస్తాన్ అఫ్గన్ పై ప్రయోగించింది. కానీ అఫ్గన్ పాక్ అంత చేతకానిది కాదని నిరూపిస్తోంది.
ఆప్ఘన్ గడ్డపై నుంచి పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి కొన్ని మిలిటెంట్ గ్రూపులు. వారికి తాలిబన్ల అండ ఉంది. అయితే పాకిస్తాన్ హఠాత్తుగా ఆఫ్ఘన్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసి అలాంటి గ్రూపులపై దాడులు చేసింది. ఇది ఆప్ఘన్ ను పాలిస్తున్న తాలిబన్లకు కోపం వచ్చింది. వెంటనే వారు రంగంలోకి దిగి పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్నారు. తమ దేశంపై దాడి చేస్తారా.. అని ఆగ్రహిస్తున్నారు. అయితే తాము ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేశామని పాకిస్తాన్ చెప్పుకుంటోంది.
తాలిబన్‌కు పోయేదేమీ ఉండదు. ఎందుకంటే వారి దగ్గర కానీ.. వారి దేశం కానీ నాశనమైనా వారికి పట్టదు. వారు చేయాలనుకున్నది చేస్తారు. అందుకే పాకిస్తాన్ తో యుద్ధం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్ కు ఇప్పుడు ఆఫ్ఘన్ తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అదే జరిగితే రేపు భారత్ ను భయపెట్టడానికి కూడా ఓ యుద్ధ విమానం పాకిస్తాన్ కు మిగలదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.