గోపిచంద్- మారుతి కలయికలో తెరకెక్కిన సినిమా ‘పక్కా కమర్షియల్’. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ ని వదిలారు. టీజర్ స్టైలిష్గా వుంది. గోపిచంద్ యాక్షన్ , లుక్స్, డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ చక్కగా కుదిరాయి. ”ఎవరికి చూపిస్తున్నారు సర్ విలనిజం..” అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. రాశి ఖాన్నా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కూడా నవ్వులు తెప్పించింది.
మారుతి సినిమా అంటే ఎదో ఒక కాన్సెప్ట్ వుంటుంది. భలే భలే మగాడివోయ్ లో మతి మరుపు, మహానుభావుడు లో అతి శుభ్రత, మొన్న వచ్చిన మంచి రోజులు వచ్చాయి లో భయం.. ఇలా ఒక బ్యాక్ డ్రాఫ్ లో కధని సెట్ చేసుకుంటారు మారుతి. పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టి హీరోని కమర్షియల్ గా చూపిస్తారేమో అనే గెస్సింగ్ ని ఆడియన్స్ కి వదిలారు. అయితే టీజర్ లో మాత్రం ఎలాంటి పాయింట్ ని రివిల్ చేయలేదు. బేసిగ్గా సినిమా పై ఆసక్తిని పెంచడానికి టీజర్ ని కట్ చేస్తారు. పక్కా కమర్షియల్ టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచేలా చేయడంలో విజయవంతమైయింది.