మారుతి అంటేనే ఎంటర్టైన్మెంట్. ఏ హీరోతో సినిమా చేసినా… తనదైన మార్క్ వినోదం తగ్గకుండా చూసుకుంటాడు. ఇప్పుడు గోపీచంద్ తో `పక్కా కమర్షియల్` సినిమా చేస్తున్నాడు. ఇది కూడా ఫుల్‌లెంగ్త్ కామెడీ సినిమానే అని… ట్రైలర్లు, టీజర్లు చూస్తే అర్థమైపోతోంది. ఈ సినిమాలో ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే.. హిలేరియస్‌గా వచ్చిందని టాక్. సాధారణంగా.. యాక్షన్ మోడ్‌తో ఇంట్రవెల్ బ్యాంగ్ వేస్తుంటారు. కానీ… మారుతి దాన్ని రివర్స్ చేసి, పూర్తి కామెడీ చేసేశాడట.
‘పక్కా కమర్షియల్’ ఇంట్రవెల్ బ్యాంగ్‌లో.. ఫక్తు కమర్షియల్ సినిమాల ఇంట్రవెల్ బ్యాంగ్‌లపై సెటర్ పడబోతోందట. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో ‘నీ అంతు సెకండాఫ్‌లో చూస్తా’ అంటూ హీరో, విలన్లు ఛాలెంజ్‌లు చేసుకోవడం కనిపిస్తుంది. ఇందులో అలాంటి డైలాగుల్ని వాడుతూనే వాటిపై సెటైర్ వేశారని టాక్. ఆ ఎపిసోడ్ మొత్తం హిలేరియస్‌గా వచ్చిందట. ఇందులో రాశీఖన్నా… ఓ టీవీ సీరియల్ ఆర్టిస్టుగా నటిస్తోంది. టీవీ సీరియళ్లు, అందులోని పాత్రలపై కూడా కామెడీ బాగా వర్కవుట్ అయ్యిందని తెలుస్తోంది. టీవీ సీరియల్స్‌లో `లాగ్` ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ `లాగ్`పై కూడా మారుతి సెటైర్లు వేశాడని సమాచారం. మొత్తానికి `పక్కా కమర్షియల్`లో కామెడీ యాంగిల్ కావల్సినంత ఉందని, అది.. ఈ సినిమాని సూపర్ హిట్ చేస్తుందని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. జులై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.