పదకొండో తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత పల్నాడు టూర్ పెట్టుకున్నారు. అయితే ఇది రాజకీయ పర్యటన కాదు. అంతకు మించి… హైవోల్టెజ్ టెన్షన్ క్రియేట్ చేసే… టూర్ గా మారే అవకాశం కనిపిస్తోంది. పల్నాడులో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వరుసగా దాడులు చేస్తున్నారని.. ఆరోపిస్తున్న టీడీపీ అధినేత.. ప్రత్యేకంగా… అలాంటి వారందర్నీ సమీకరించి.. బాధితుల శిబిరం పెట్టారు. పోలీసులకు .. నేరుగా హెచ్చరిక పంపారు. వైసీపీ బాధితులందర్నీ… ఆయా గ్రామాలకు పోలీసులే తీసుకెళ్లి… ప్రశాంతంగా బతికేలా భరోసా ఇవ్వాలని… లేకపోతే.. తానే తీసుకెళ్తానని.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాను బాధ్యుడిని కాదని.. హెచ్చరించారు. అయితే పోలీసులు ముందుకు రాలేదు.
నిజానికి రెండు, మూడు వారాల కిందట.. టీడీపీ నేతలంతా.. పల్నాడు పర్యటనకు వెళ్లారు. అయితే.. అప్పట్లో పోలీసులు… కొంత సమయం అడిగారు. తాము అంతా సర్దుబాటు చేస్తామని చెప్పి పంపించారు. కానీ పోలీసులు ఏం చేయలేదు. దాంతో.. దీంతో చంద్రబాబు.. పల్నాడుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. 11న ఛలో పల్నాడు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆరోజున పల్నాడుకు నాయకులంతా తరలిరావాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఒంటరి కాదని.. పెద్ద వ్యవస్థ అని.. ఛలో పల్నాడు ద్వారా చాటుదామన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొంటున్న వారందరికీ అండగా ఉండేందుకు పదో తేదీన లీగల్ సెల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్నాడులో.. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. యరపతినేని, కోడెల వంటి టీడీపీ నేతలపై కేసులతో భయపెడుతూండటంతో.. టీడీపీ నేతలు జంకే పరిస్థితి ఏర్పడింది. దాంతో.. చాలా మంది టీడీపీ మద్దతుదారులు గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరందర్నీ దగ్గరకు తీసి.. శిబిరం ఏర్పాటు చేశారు.. టీడీపీ అధినేత. టీడీపీకి పోటీగా వైసీపీ నేతలు.. టీడీపీ బాధితుల శిబిరం పేరుతో.. పిడుగురాళ్లలో ఓ శిబిరం పెట్టడంతో.. దానికి హోంమంత్రి సుచరిత హాజరయ్యారు. దీంతో వ్యవహారం మరింత వివాదాస్పదమయింది. పదకొండో తేదీన… పల్నాడులో ఎలాంటి పరిస్థితులెదురైనా.. వెనక్కి తగ్గకూడదని టీడీపీ భావిస్తోంది.