గ్రామ స్వరాజ్యం గ్రామ పంచాయతీల వల్లనే సాధ్యమవుతుందని గాంధీజీ అంటే… కాదు గ్రామ సచివాలయాల వల్లేనని గాంధీజీ చెప్పారని ప్రచారం చేసి.. జగన్ రెడ్డి పంచాయతీల్ని నిర్వీర్యం చేశారు. గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఉంటే దానికి పోటీగా గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేసి పంచాయతీ నిధులను కూడా మళ్లించి… ప్రజలు ఎన్నుకున్న స్థానిక ప్రభుత్వా లను డమ్మీలను చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేందుకు రెడీ అయింది.
గ్రామ, వార్డు సచివాలయాల వల్ల ప్రత్యేకంగా వచ్చే లాభాలేమీ లేవు. పంచాయతీ సిబ్బంది.. ఇతర ప్రభుత్వ సిబ్బంది చేసే పనులను మాత్రమే చేసేవారు. అంటే.., డబుల్ మ్యాన్ పవర్ అయింది. అయితే వారితో పార్టీ పరమైన పనులు చేసుకోవడానికి ఉపయయోగించారు. కొత్త ప్రభుత్వం సచివాలయవ్యవస్థను ప్రజలకు జవాబుదారీగా ఉంచేందుకు సిద్ధమయింది. ఇందు కోసం సచివాలయాలవ్యవస్థను పంచాయతీలతో అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రక్రియను ప్రారంభించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలన్నీ రాజకీయ స్వార్థంతోనే తీసుకున్నవే. ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేయాలని వారిని గుప్పిట్లో పెట్టుకోవాలని వాలంటీర్లు, సచివాలయవ్యవస్థను తెచ్చి పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఇప్పుడా వ్యవస్థలు ఆరో వేలుగా మారాయి. వారి వల్ల పైసా ఉపయోగం లేకపోగా వందల కోట్ల ఖర్చు అవుతోంది. దీన్ని కరెక్ట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.