ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. సాంకేతికంగా టీడీపీకి 23 ఓట్లు ఉన్నాయి. అనూరాధకు కూడా 23 ఓట్లు వచ్చాయి. 22 ఓట్లు వస్తేనే ఓ అభ్యర్తి విజయం సాధించారు. అనూరాధకు ఓ ఓటు ఎక్కువే వచ్చింది. దీంతో ఆమె విజయం ఖరారయింది.
టీడీపీ తపపున 23 ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ నలుగురు ఫిరాయించారు. అంటే 19 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. వారిలో ఇద్దరు ఎవరనేదానిపై అందరికీ క్లారిటీ ఉంది. వైసీపీ కూడా వారిని లెక్కలోకి తీసుకోలేదు. వారే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి. మరో ఇద్దరు వైసీపీతో పాటు క్యాంప్‌కు హాజరై .. సైలెంట్‌గా టీడీపీకి ఓట్లేశారు. వారెవరన్నది వైసీపీ నేతలకూ స్పష్టత లేకుండా పోయింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడు ఎమ్మెల్సీ సీట్లు గెలవాలని జగన్ పంతం పట్టారు. చాలా ఖర్చు పెట్టి హోటల్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యాంపులు నిర్వహించారు. ఓ అభ్యర్థికి ఇబ్బంది అయితే విశాఖ నుంచి ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేశారు. కానీ మొత్తం శ్రమ బూడిదలో పోసిన పన్నీరయింది.