లీకువీరులు ఓ రేంజులో రెచ్చిపోతున్నారు. ప్రతీ నిర్మాణ సంస్థలోనూ కొంతమంది లీకు వీరులు తయారవుతున్నారు. సంస్థ నుంచి అఫీషియల్‌గా రావాల్సిన విషయాలు, విశేషాలన్నీ.. లీకు వీరుల పుణ్యాన ముందే బయట పడిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్ గోపీచంద్‌పైనా పడింది. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `పంతం`. కె. చక్రవర్తి దర్శకుడు. గురువారం ఫస్ట్ లుక్ విడుదల కావాల్సింది. అయితే బుధవారం పొద్దుట నుంచే పంతం లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలెట్టింది. ఈ విషయం తెలుసుకున్న చిత్రబృందం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇక గత్యంతరం లేకపోవడంతో ఒకరోజు ముందే.. ఫస్ట్ లుక్‌ని విడుదల చేసేశారు. గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రమిది. యాక్షన్ ఎంటర్టైనర్గా సాగబోతోంది. ప్రమోషన్లను మెల్లమెల్లగా మొదలెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం. త్వరలోనే టీజర్‌ని వదులుతారు.