కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బాస్కెట్ బాల్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన హంగామా హైలెట్ అయింది. ఆయన వైద్యుల్ని బూతులు తిడుతూ .. అనుచరులతో కలిసి మెడికల్ కాలేజీ వర్గాలపై చేసిన దాడితో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ అంశం సహజంగానే వైరల్ అయింది. ఎందుకంటే… వైసీపీ ఎమ్మెల్యే ఇలాంటివి చేస్తే సహజమని అనుకుంటారు.. తిరిగి వైద్యులపై కేసులు పెడతారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓ జనసేన ఎమ్మెల్యే ఇలా చేయడంతో వైరల్ అయింది.
అక్కడే జరిగినా దాడి చేయడం, బూతులు తిట్టడం మాత్రం తప్పు. అందుకే జనసేన ఎమ్మెల్యేకు ఎలాంటి సపోర్టు చేయవద్దవన్ పవన్ స్పష్టం చేశారు. అంతేనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ , ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వైద్యులు ఫిర్యాదు చేస్తే ఆ ప్రకారం ఆయనపై కేసులు పెట్టి చర్యలు తీసుకోనున్నారు. తాను చేసిన తప్పు చిన్నది కాదని తెలియడంతో పంతం నానాజీ కూడా పంతం వీడారు. రాత్రికి రాత్రి వైద్య సంఘాలన్నింటినీ పిలిపించుకుని క్షమామపణలు చెప్పారు.
పంతం నానాజీ క్షమాపణలు చెప్పినా.. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు పోలీసులకు స్పష్టం చేశారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పార్టీ ప్రజాప్రతినిధులు రోల్ మోడల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే అది ప్రజాసేవలోనే కానీ… ఇలాంటి దౌర్జన్యాల్లో కాదు. అందుకే పంతం నానాజీ ఇష్యూని పవన్ సీరియస్ గా తీసుకున్నారు. రాజకీయాల్లో ఇలాంటి పంతాలనే నినాశకాలని ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారని జనసేన పెద్దలు అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది.