దర్శకుడు సంపత్ నంది… నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. తన ‘గాలిపటం’ ఆర్టికంగా లాభాల్ని తెచ్చుకుంది. ఇప్పుడు ‘పేపర్ బోయ్’ని రంగంలోకి దింపుతున్నాడు. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన చిత్రమిది. జయ శంకర్ దర్శకుడు. టీజర్ విడుదలైంది. అనుకున్నట్టే ఇదో పేపర్ బోయ్ ప్రేమకథ. ”అయిదున్నర అడుగుల సంప్రదాయం తను.. యాభై కిలోల తెలుగుదనం తను. అందుకే ఐదేళ్లుగా తనింటికి ప్రతీరోజూ వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పి వస్తున్నా”
అనే డైలాగ్‌తో ఈ పేపర్ బాయ్ లక్ష్యమేంటో చెప్పేశాడు. విజువల్ బ్యూటీ ఈ టీజర్లో కనిపించింది. చిన్న సినిమా అయినా, రిచ్ గా తీసినట్టు అనిపిస్తోంది. శోభన్ – రియాల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరినట్టుంది. బీటెక్ చదివి.. బతకడం కోసం పేపర్ బోయ్ అవతారమెత్తిన ఓ కుర్రాడు… తన ప్రేమని, భవిష్యత్తునీ ఎలా దక్కించుకున్నాడు? అనే పాయింట్‌తో సాగే కథ ఇది. ట్రీట్మెంట్ బాగుంటే ఇలాంటి కథలు వర్కవుట్ అవుతాయి కూడా. మరి దర్శకుడు ఈ విషయంలో ఎంత వరకూ సక్సెస్ అయ్యాడో చూడాలి.