సంపత్‌నంది నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ‘పేపర్ బాయ్’. ట్రైలర్లు, పాటలు.. ఈసినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీని చూడబోతున్నామన్న ఫీల్ కలిగించాయి. చిన్న సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు హాట్ కేకులే. అందుకే గీతా ఆర్ట్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఏపీ, తెలంగాణ రైట్స్ మొత్తాన్ని ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది ఆ సంస్థ. బన్నీవాసు, అల్లు అరవింద్… ఒకటికి రెండుసార్లు ఈ సినిమా చూసుకుని… డీల్ కుదుర్చుకున్నారు. ఈ డీల్ వల్ల.. అటు సంపత్‌నంది, ఇటు గీతా ఆర్ట్స్ రెండూ లాభపడ్డాయని సమాచారం. ఈ సినిమాని ఈ రేటుకి అమ్ముకోవడం వల్ల సంపత్ నంది… టేబుల్ ప్రాఫిట్‌తో బయటపడగలిగారు. గీతా ఆర్ట్స్ కూడా మంచి రేటుకి, క్వాలిటీ – బజ్ ఉన్న సినిమాని దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ల బాధ్యత కూడా గీతా ఆర్ట్స్ చూసుకోబోతోందని టాక్. చిరు, బన్నీ, చరణ్‌లను దింపి.. పేపర్ బోయ్‌కి భారీ ప్రమోషన్లు కల్పించాలని చూస్తోందట. ‘గీత గోవిందం’తో గీతా ఆర్ట్స్ మంచి హుషారుగా ఉంది. ఇదే ఊపులో పేపర్ బోయ్తో కూడా భారీ లాభాల్ని ఆర్జించాలని చూస్తోంది. గీతా ఆర్ట్స్ చేతిలో పడ్డాక పేపర్ బోయ్ రేంజు కూడా పెరగడం ఖాయం.