ఏడింటికి టీజ‌ర్‌.. ఆరింటికి లీక్‌

వ‌ర్మ దారిలోనే వెళ్తున్నాడు నూత‌న్ నాయుడు.వ‌ర్మ ట్రిక్కుల‌నే ఫాలో అవుతున్నాడు. వ‌ర్మ‌పై `ప‌రాన్న జీవి` అనే సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ నూత‌న్ నాయుడు ద‌ర్శ‌కుడు. ఈ టీజ‌ర్‌ని ఈరోజు ఏడింటికి రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది చిత్ర‌బృందం. అంతోనే కౌంట‌ర్ వేసేసింది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఓ గంట ముందే టీజ‌ర్ లీక్ అవుతున్నందుకు సంతోషంగా ఉంద‌ని, టీమ్ స‌భ్యుల్లో ఒక‌రి కుట్ర వ‌ల్ల టీజ‌ర్ గంట ముందే బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని సెటైర్ వేసింది. ఈ సెటైర్ ఎవ‌రిపైనో ఈజీగా అర్థ‌మైపోయి ఉంటుంది. వవ‌ర్ స్టార్ ట్రైల‌ర్‌ చూడాలంటే పాతిక రూపాయ‌ల టికెట్టు పెట్టాడు వ‌ర్మ‌. తీరా చూస్తే.. ట్రైల‌ర్ ముందే లీకైపోయింది. అది వ‌ర్మ‌నే కావాల‌ని చేశాడ‌ని, అదో ప‌బ్లిసిటీ ట్రిక్క‌ని జ‌నం న‌మ్మ‌కం. దాన్నే ఇప్పుడు నూత‌న్ నాయుడు కూడా ప్లే చేస్తున్నాడు. మా టీజ‌ర్ లీకవుతోంది… అని ముందే చెప్ప‌డం – నిజంగా కొత్త స్ట్రాట‌జీనే. ఈరోజు టీజ‌ర్ వ‌స్తుంటే, రేపు ట్రైల‌ర్‌ని విడుద‌ల చేస్తున్నారు. ఈలోగా రెండు పాట‌ల్నీ బ‌య‌ట‌కు వ‌దులుతార్ట‌. మొత్తానికి `ప‌రాన్న‌జీవి` ప్ర‌మోష‌న్లు ఫుల్ స్వింగ్ లో ఉన్న‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close