ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో చదవాలనే అంశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు వదిలేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఏపీ సర్కార్… ఆ విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులందరూ.. తమకు ఇంగ్లిష్ మీడియమే కావాలంటూ.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్ మీడియంలోనే చదివితేనే తమ పిల్ల భవిష్యత్ బాగుంటుందని వారు చెప్పారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్స్ సేకరించారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో చెప్పాలటూ మూడు ఆప్షన్స్ ఇచ్చారు.
తెలుగు, ఇంగ్లిష్.. ఇతర మీడియం ఏదైనా ఒకటి ఈ ఆప్షన్స్‌లో ఉంచారు. దాదాపుగా 18 లక్షల మంది.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే పిల్లలు ఉన్నారు. వారి తల్లిదండ్రుల్లో 96.17 శాతం తమకు ఇంగ్లిష్ మీడియం మాత్రమే కావాలని చెప్పారు. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం మంది కాగా ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారు. హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినందున..ఈ అఫిడవిట్లను హైకోర్టులో సమర్పించాల్సిన అవసరం లేదు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం… తల్లిదండ్రుల ఇష్టాల్ని తెలుసుకున్నామని ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంది.
అయితే సాధారణంగా… స్కూళ్లలో పిల్లల్ని చేర్పించేటప్పుడు… ఏ మీడియంలో చేర్పించాలో విద్యార్థులు, తల్లిదండ్రులు చెబుతారు. అయితే.. ఇప్పుడు ప్రత్యేకంగా వాలంటీర్లను పెట్టి ప్రభుత్వం… అంగీకర పత్రాలు తీసుకుంది. ఇక ప్రభుత్వ పట్టుదల ప్రకారం.. ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తాను అనుకున్నట్లుగా చేయడంలో సక్సెస్ అయిందని అనుకోవచ్చు.