బాలీవుడ్ హాట్ గాళ్ పరిణీతి చోప్రా ఎప్పటినుండో సౌత్ సినిమాల్లో నటించాలని తహతహలాడుతుంది. అయితే అంతకుముందు కొన్నిసార్లు ఆ చాన్స్ వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ అవ్వక అమ్మడు ఇక్కడ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం కొరటాల శివ యంగ్ టైగర్ కాంబినేషన్లో వస్తున్న మూవీలో పరిణీతి చోప్రా ఓకే అయ్యే చాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అవసరముండగా ఒక హీరోయిన్ గా అనైకా దస్తర్ మరో హీరోయిన్ గా పరిణీతి పేర్లు వినబడుతున్నాయి.
సినిమాలో అవసరమున్నా లేకున్నా ముఫ్ఫులతో హోరెత్తించే పరిణీతి చోప్రా తెలుగు సినిమా చేయడం అంటే ఆమెని అభిమానించే తెలుగు ప్రేక్షకులకు పెద్ద పండుగే. అయితే ఎన్టీఆర్ తో పరిణీతి ఓకేనా కాదా అన్నది మాత్రం ఇంకా కన్ఫాం అవ్వలేదు. కొరటాలేమో మరోసారి శృతి హాసన్నే తన హీరోయిన్ గా తీసుకుందామనే ఆలోచనలో ఉంటే.. ఫ్యాన్స్ సజెషన్ తో ఎన్టీఆర్ బాలీవుడ్ బ్యూటీకే ప్రిఫర్ చేస్తున్నాడట.
అంతకుముందు మహేష్ తో కూడా పరిణీతి సినిమా ఉంటుందని హడావిడి చేసి తీరా తుస్సుమనిపించారు. మరి ఈసారైనా అమ్మడు తెలుగులో నటిస్తుందా లేదా అన్న కన్ ఫ్యూజన్ మరికొద్దిరోజుల్లో తేలనుంది. ఒకవేళ అదే నిజంగానే పణీతి ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయ్యే అయితే అదో క్రేజీ కాంబో అవుతుందనడంలో సందేహం లేదు.