యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో షూటింగ్ చేస్తున్నా.. అది కంప్లీట్ అవ్వగానే కోరటాల శివతో చేసే సినిమా షెడ్యూల్లో పాల్గొంటాడు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘జనతా గ్యారేజ్’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి మాస్ హీరోగా కనిపించనున్నాడట. అయితే మొదటి నుండి సంక్షోభంలో ఉన్న ఈ సినిమా హీరోయిన్ విషయం ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు.
తెలుస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ పరిణీతి చోప్రాని ఫైనల్ చేశారని టాక్. ఎప్పటినుండో సౌత్ సినిమాల్లో నటించాలని తహ తహలాడుతున్న పరిణీతి ఇక్కడ కూడా పాగ వేయాలనుకుంటుంది. ప్రియాంకా కజిన్ గా వెండితెరకు పరిచయమైనా అమ్మడి సోయగాలకు బాలీవుడ్ ప్రేక్షకులు త్వరగానే బ్యూటీకి కనెక్ట్ అయ్యారు.
సినిమాలో పరిణీతి ఉందంటే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అన్నట్టే. ఇక ముద్దుసీన్లయితే అమ్మడు రెచ్చిపోయి మరి చేసేస్తుంది.. బాలీవు హాట్ బ్యూటీగా ఆకట్టుకుంటున్న పరిణీతి సౌత్ లో అది తెలుగులో సరాసరి యంగ్ టైగర్ పక్కన చాన్స్ కొట్టేసింది. మరి అమ్మడు తెలుగు ప్రేక్షకులను ఎలా రంజింపచేయనుందో చూడాలి.