పారిస్ లో శుక్రవారం రాత్రి ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబుదాడులు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బంధుమిత్రులకు, అభిమానులకు కలవరం కలిగించాయి. ఆమె మొన్ననే పారిస్ కు విహారయాత్రకు వెళ్లింది. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు ట్విటర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఉగ్రవాద దాడులు జరిగిన ప్రాంతాలకూ వెళ్లింది.
ఉగ్రవాద దాడుల సమాచారం తెలియగానే ఆమెన్ కాంటాక్ట్ చేయడానికి ముంబైలోని బంధుమిత్రులు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఆమెకు ఏమైందో అని అంతా కంగారు పడ్డారు. ఇంతలో శనివారం ఉదయం ఆమె ట్వీట్ తో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడే ముంబైలో ల్యాండ్ అయ్యాను. నేను క్షేమంగా పారిస్ నుంచి వచ్చాను. నేను క్షేమంగా ఉండాలని మెసేజ్ లు పంపిన వారందరికీ ధన్యవాదాలంటూ ట్వీటి చేసింది.
పారిస్ టూర్ విశేషాలను రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు శ్రయోభిలాషులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియా ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో, పారిస్ బాంబు దాడుల సమయంలో ఆమె ఎక్కడున్నా సోషల్ మీడియాలో స్పందిస్తుందని భావించారు. కానీ అప్పటికే ఆమె ముంబై విమానం ఎక్కడంతో సోషల్ మీడియాతో కనెక్ట్ అయి ఉండటం వీలు కాలేదు. ఈలోగా బంధుమిత్రులు కంగారు పడ్డారు. మొత్తానికి ఆమె క్షేమంగా ముంబై చేరింది.