నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేశారు. రేపు నీలం సాహ్ని కొత్త ఎస్ఈసీగా బాధ్యతలు చేపడతారు. అది లాంఛనమే. అయితే ఇప్పటికే.. పరిషత్ ఎన్నికలు ఎప్పుడు.. ఎలా నిర్వహించాలన్నదానిపై నోటిఫికేషన్ సిద్ధమయిపోయిందన్న ప్రచారాన్ని వైసీపీ వర్గాలు చేస్తున్నారు. నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిషత్ ఎన్నికలపై రివ్యూ చేస్తారని.. ఆతర్వాత ఏ క్షణంలోనే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని.. ఎక్కడ నిలిచిపోయింది.. అక్కడ నుంచే ప్రారంభిస్తారని.. వారం .. పది రోజుల్లో పూర్తి చేస్తారని అంటున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై చాలా ఆసక్తితో ఉన్నారు. ఆయన ఎప్పుడు సమావేశం పెట్టినా… ఏదైనా సందర్భం వచ్చినా రాకపోయినా… కల్పించుకుని అయినా … పరిషత్ ఎన్నికలు అడ్డం అయిపోయాయని.. అయి పూర్తయితే.. ఏ అడ్డం లేకుండా పనులన్నీ చేసుకోవచ్చని చెబుతూ ఉంటారు. ఆయన ఆరు రోజులే గడువుగా చెబుతూ ఉంటారు. అంటే ఆరు రోజుల్లో పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన అనుకుంటారు. అయితే రాష్ట్రం మొత్తం నాలుగు విడుతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. పరిషత్ ఎన్నికలనూ అలాగే నిర్వహించాల్సి ఉంటుంది. కానీ నీలం సాహ్ని ఎలా నిర్వహించాలనుకుంటే అలా నిర్వహిస్తారు.
నీలం సాహ్ని ఎస్ఈసీ అయినా గత రికార్డును చూస్తే.. ప్రభుత్వ ఆదేశాలను ఆమె తూ.చ తప్పకుండా పాటిస్తారు. అక్కడ్నుంచి వచ్చే ఆదేశాలే.. ఎస్ఈసీ పేరుతో అధికారికంగా విడుదలవుతాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదని విపక్షాలుఇప్పటికే విమర్శలు ప్రారంభించాయి. పరిషత్ ఎన్నికలు..మిగిలిపోయిన మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయడానికి ఏపీ సర్కార్ చాలా ఆత్రుతగా ఉంది. వీలైనత త్వరగా వాటిని కంప్లీట్ చేసేందుకు నీలం సహాని… పదవి బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచే విధులు నిర్వహించే అవకాశం ఉంది.