తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎంత ఘోరంగా పతనం అయిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో.. ఆ పార్టీ పరిస్థితి మీద సరదాగా ఒక పేరడీ పాట
సినిమా : మూగమనసులు
పాట : ” పాడుతా తీయగా చల్లగా” బాణీలో పేరడీ
పేరడీ రచన : భారతీకృష్ణ
ఓటమే తీయగా బాధగా
బలిపెట్టెగా పార్టీనే కత్తిలా.. జంపింగు కత్తిలా
ఓటమే తీయగా బాధగా…
ఓడిపోతే మనసు కాస్త బరువు అవుతది
బరువు అయిన మనసు ఘోర కలలు కంటది
ఓడిపోతే మనసు కాస్త బరువు అవుతది
బరువు అయిన మనసు ఘోర కలలు కంటది
ఘోర కలలు వెంటాడును పతనం వరకూ
ఘోర కలలు వెంటాడును పతనం వరకూ
ఆ పతనాన్నీ శాసించే ‘దొరలు’ ఎందుకూ?
ఓటమే తీయగా బాధగా
బలిపెట్టెగా పార్టీనే కత్తిలా.. జంపింగు కత్తిలా
ఓటమే తీయగా బాధగా…
గుండె మంటలను చూపే చానెళ్ల కెమెరాలు
ఆ మంటల ఎగదోయును చాల్చాలు
గుండె మంటలను చూపే చానెళ్ల కెమెరాలు
ఆ మంటల ఎగదోయును చాల్చాలు
పోయినోళ్లు అందరూ మంచోళ్లు
పోయినోళ్లు అందరూ మంచోళ్లు
ఉన్నోళ్లు గతిలేకనె మిగిలిన వాళ్లు
ఓటమే తీయగా బాధగా
బలిపెట్టెగా పార్టీనే కత్తిలా.. జంపింగు కత్తిలా
ఓటమే తీయగా బాధగా…
నేతలంత పోతెనేమి పార్టీ ఉంటది
కుక్క చించు విస్తరివలె మిగిలిపోతది
నేతలంత పోతెనేమి పార్టీ ఉంటది
కుక్క చించు విస్తరివలె మిగిలిపోతది
రాకపోక సహజమమ్మ పార్టీలోన
రాకపోక సహజమమ్మ పార్టీలోన
పోకపోకకూ అదిమరీ చితికిపోతది
ఓటమే తీయగా బాధగా
బలిపెట్టెగా పార్టీనే కత్తిలా.. జంపింగు కత్తిలా
ఓటమే తీయగా బాధగా…