వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆయన తన పెనుమలూరు నుంచి కాకండా గన్నవరం నుంచి పోటీ చేయమన్నారట. వంద శాతం ఓడిపోయే సీటును తనకు ఇచ్చేందుకు జగన్ రెడ్డి చేసిన ప్లాన్ తెలిసి.. పార్థసారధికి మైండ్ బ్లాంక్ అయింది. వెంటనే సర్దేసుకున్నారు. బయట ప్రచారం చేసినట్లుగా ఆయనకు మచిలీపట్నం ఎంపీ లేదా నూజివీడు లేదా పెనుమలూరే ఇవ్వడానికి జగన్ రెడ్డి రెడీ కాలేదు.
పైగా చంద్రబాబు, పవన్ లను బూతులు తిట్టలేదని కూడా జగన్ రెడ్డి దూరం పెట్టారు. ఈ విషయాన్ని పార్థసారధినే బయట పెట్టారు. పెనుమలూరుకు ఇంచార్జుగా జోగి రమేష్ ను జగన్ రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత ఓపెన్ అయ్యారు. వైసీపీలో జగన్ రెడ్డి బలమైన బీసీ నేతల్ని ఎలా తొక్కేయాలనుకుంటారో వివరించారు. సీనియర్ ను.. ఏ వివాదాలు లేని తనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదో జగనే చెప్పాలన్నారు. పార్థసారధి ప్రతిపక్ష నేతలపై బూతులు తిట్టేందుకు అంగీకరించలేదు. ఐదేళ్ల కాలంలోఆయన పాలసీలపై మాట్లాడే చాన్సిస్తే మాట్లాడారు కానీ.. సభ్యత, సంస్కారం మర్చిపోలేదు. జగన్ రెడ్డి పార్టీకి ఎంత విధేయంగా ఉన్నప్పటికీ.. బూతులు తిట్టడమే కొలమానంగా పెట్టుకుంటారు.
వంశీ అలా బూతులు తిట్టారు. అయినా ఆయనకు టిక్కెట్ గ్యారంటీ లేదని తేలిపోయింది. పార్థసారధిని అక్కడ పెట్టాలనుకున్నారు ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మరో నేతను పెట్టే అవకాశం ఉంది. పెట్టకపోతే.. ఖచ్చితంగా ఓడిపోయే సీటుు కదా అని వంశీకే ఇచ్చేసినా ఆశ్చర్యం లేదని వైసీపీలోనే సెటైర్లు వేస్తున్నారు.