బ్రహ్మోత్సవం ఫ్లాప్ అనగానే.. అందరి వేళ్లూ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలవైపే చూపించాయి. మహేష్ నమ్మకాన్ని వమ్ము చేశాడని దూషించాయి. అసలు కథే లేకుండా ఎలా సినిమా తీశాడంటూ… అందరూ ఆశ్చర్యపోతున్నారు. మహేష్, పీవీపీ ఎలా ఒప్పుకొన్నారంటూ షాక్ కి గురయ్యారు. అయితే శ్రీకాంత్ అడ్డాల మాత్రం కథని బాగానే చెప్పాడట. కథ చెబుతున్నప్పుడు కలిగిన ఎమోషనల్ పీలింగ్ తీసినప్పుడు రాలేదని, తెరపై అది 10 శాతం కూడా కనిపించలేదని పీవీపీ, ఆయన సన్నిహితులు ఇప్పుడు అభిప్రాయ పడుతున్నారు. మేకింగ్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడనుకొన్న శ్రీకాంత్ చాలా సన్నివేశాల్ని తేల్చేశాడని ఇప్పుడు చిత్రబృందం అభిప్రాయపడుతోంది.
మధ్యలో పరుచూరి బ్రదర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా స్ర్కిప్టుని పాడు చేసిందని చెప్పుకొంటున్నారు. వాళ్లు యాడ్ చేసిన సీన్ల వల్ల.. సినిమా లెంగ్త్ పెరిగింది తప్ప, అదనపు ప్రయోజనం ఏమీ చేకూరలేదని, శ్రీకాంత్ ఓరకంగా సీన్ రాస్తే.. దాన్ని రివర్స్‌లో తిరగరాశారని.. దాంతో కంటెంట్ మిస్సయ్యిందని చెబుతున్నవాళ్లూ ఉన్నారు. చైతన్య కృష్ణ, కదీర్బాబులాంటివాళ్లు కూడా ఈ స్ర్కిప్టులో ఇన్వాల్వ్ అయ్యారు. ఇంతమంది చేయి చేసుకోవడం వల్ల కూడా బ్రహ్మోత్సవానికి నష్టమే జరిగిందని బాధపడుతోంది చిత్రబృందం. ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం? డబ్బాలన్నీ తిరిగొచ్చేశాక..!