సినీ రచయితలుగా పరుచూరి వారి డైలాగులకు, వారి మార్కు పొలిటికల్ పంచులకూ ఉన్న ప్రత్యేకత వేరు. వారు రాసిన డైలాగులన్నీ ఒకెత్తు అయితే రాజకీయ అంశాలపై వారు రాసిన, గోపాల కృష్ణ తెరపై కనిపించి తనదైన డైలాగ్ డెలివరీతో పలికినవి ఒకెత్తు. ఇదే సమయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా పరుచూరి సోదరుల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.
ఎంత భారీ డైలాగ్ చెప్పామనేదానికంటే… ఎంత అర్ధమయ్యేలా చెప్పామనేది, రాసామనేది చాలా ముఖ్యం. పైగా ఆ మాటకు, వాక్యానికి కాస్త వెటకారం కలిస్తే… ఆ డైలాగ్ కి ఉన్న పవర్ అమాంతం మారిపోయి, మాస్ లోకి దూసుకెళ్లిపోతుంది. ఈ క్రమంలో నోట్ల రద్దు అనంతరం సామాన్యుడు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదనే సంగతి, ఇప్పటికీ నగదు విత్ డ్రాల విషయంలో ప్రజలు ఎదుర్కోంటున్న కండిషన్స్ ని తనదైన వాక్యంతో చెప్పారు పరుచూరి గోపాల కృష్ణ. ఇంతకూ ఆయన చెప్పిన మాట ఏమిటయ్య అంటే… “మన బ్యాంకు అక్కౌంట్లో వున్న డబ్బులు మనం స్వేచ్ఛగా తీసుకునే రోజుకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయులందరికి 68 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!” అని.
ఈ ఒక్క మాట చాలు… నోట్ల రద్దు నిర్ణయం, అనంతరం ప్రజలు పడిన ఇబ్బందులు, ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయి ఇన్నిరోజులైనా ఇప్పటికీ ఎవరి డబ్బులు వారు తీసుకొవడానికే ఇంకా అనేకరకాల కండిషన్స్ ఎదురవుతున్న వేల, పరుచూరి వారి మార్కు పంచ్ డైలాగ్ విత్ వెటకారం బాగా పేలినట్లే!!
మన బ్యాంకు అక్కౌంట్లో వున్న డబ్బులు మనం స్వేచ్ఛగా తీసుకునే రోజుకోసం ఆశగా ఎదురు చూస్తున్న భారతీయులందరికి 68 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
— Paruchuri GK (@GkParuchuri) January 26, 2017