సర్కారు వారి పాటలో… డైలాగుల్ని కుమ్మరించేశాడు పరశురామ్. స్వతహాగా రచయిత కాబట్టి… తన పంచ్ పవర్, పెన్ పవర్ చూపించేశాడు. ఎక్కువ డైలాగులు మాసీగానే ఉన్నాయి. అయితే.. అందులో `నేను ఉన్నాను.. నేను విన్నాను` డైలాగ్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. ఈ డైలాగ్ ఎందుకు రాయాల్సివచ్చిందో.. కారణం ఇప్పుడు చెప్పుకొచ్చాడు పరశురామ్.
“నాకు రాజశేఖర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయనకు హీరో వర్షిప్ ఉండేది. ఆయన నోటి నుంచి వచ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటికల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్కలో భలే చెప్పారు అనిపించింది. అలాంటి సందర్భం `సర్కారు వారి పాట`లో ఒకటి వచ్చింది. కథానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భరోసానే హీరో ఇవ్వాల్సివచ్చినప్పుడు ఈ డైలాగ్ పర్ఫెక్ట్ గా సరిపోతుందనిపించింది. స్క్రిప్టు రాస్తున్నప్పుడే ఈ డైలాగ్ ఉంది. మహేష్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఎలాంటి డిస్కర్షన్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు పరశురామ్. ఈనెల 12న సర్కారు వారి పాట విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఆ తరవాత.. నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నారు