ఈవారం విడుదలైన చిత్రాలలో శ్రీకారం మంచి టాకే సంపాదించుకుంది. చక్కటి సందేశంతో – సాగిన సినిమా అని ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు కితాబు ఇస్తున్నారు. కిషోర్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే ఈ సినిమాలో మరో దర్శకుడి హ్యాండ్ కూడా ఉందట. ఆ దర్శకుడెవరో కాదు…. పరశురామ్,
14 రీల్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది. ఇదే సంస్థలో పరశురామ్ `సర్కారు వారి పాట` చేస్తున్నాడు. శ్రీకారం కథ విషయంలోనూ పరశురామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందట. కరోనా తరవాత.. స్క్రిప్టులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ సమయంలో.. పరశురామ్ కొన్ని కీలకమైన సలహాలు అందించాడట. కరోనా వల్ల వ్యవసాయం రంగంలో వచ్చిన మార్పులకు సంబంధించిన సన్నివేశాలన్నీ.. పరశురామ్ సలహాతో రాసుకున్నవేనట. అంతేకాదు.. క్లైమాక్స్‌లో రావు రమేష్చెప్పిన డైలాగుల్లో కొన్ని.. డబ్బింగ్ సమయంలో పరశురామే.. చిన్న చిన్న మార్పులు చేసి రాసిచ్చాడని తెలుస్తోంది. అలా.. ఓ వైపు సర్కారు వారి పాట పనులు చూసుకుంటూనే తన నిర్మాతల కోసం `శ్రీకారం`కి చేదోడు వాదోడుగా నిలిచాడని తెలుస్తోంది.