సర్కారు వారి పాట తరవాత పరశురామ్ సినిమా పట్టాలెక్కడానికి టైమ్ పట్టింది. అయితే ఒకేసారి రెండు ప్రాజెక్టులు ఓకే చేసుకొన్నాడు పరశురామ్. ఓ సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుంది. మరోటి కార్తీతో ఓకే అయ్యింది. ఈ సినిమాకి రెంచ్ రాజు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు. ఈ ఆగస్టులో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈసినిమాకి పరశురామ్ ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం తీసుకొంటున్నట్టు టాక్. గీత గోవిందం సినిమాకి.. రూ.100 కోట్లు వచ్చాక పరశురామ్ కి రూ.10 కోట్ల పారితోషికం ఇచ్చారు. సర్కారు వారి పాటకు రూ.13 కోట్లు అందుకొన్నాడు. విజయ్ దేవరకొండ సినిమాకి తన పారితోషికం రూ.15 కోట్లకు పెరిగింది. ఇప్పుడు కార్తి సినిమాకి రూ.20 కోట్లు అడుగుతున్నాడట. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగు, తమిళం.. ఇలా రెండు భాషల్లోనూ తీయాల్సిన సినిమా ఇది. అందుకే పరశురామ్ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారని టాక్. కార్తికి సైతం ఈ సినిమా కోసం భారీ మొత్తంలోనే పారితోషికం ఇవ్వబోతున్నార్ట. ఇది వరకు `ఊపిరి`తో స్ట్రయిట్ తెలుగు సినిమా చేశాడు కార్తి. అప్పట్లో తన పారితోషికం తక్కువే. ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ఇది. తమిళంలో అందుకొంటున్న పారితోషికం కంటే ఎక్కువే ఇచ్చే అవకాశాలున్నాయి.