జగన్ రెడ్డికి దళిత క్రిస్టియన్లు మద్దతుగా ఉండటానికి బ్రదర్ అనిల్ ఓ ప్రధాన కారణం. ఆయన వైఎస్ హయాం నుంచి తెలుగు రాష్ట్రాల్లో చర్చిల్లో ప్రత్యేక సమావేశాలు పెట్టి.. పాస్టర్లకు కానుకలిచ్చి జగన్ రెడ్డి గెలవాలని ప్రార్తనలు చేయడం.. కానుకలివ్వడం వంటివి చేస్తూంటారు. గత ఎన్నికల్లో జగన్ కోసం ఏపీలో చర్చిల చుట్టూ ఆయన చేసిన రాజకీయాలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. గిరిజన ప్రాంతాల్లో అత్యధిక మందిన మతం మార్చేశారు. పాడేరు. అరకు వంటి చోట్ల వైసీపీ వరుసగా గెలుస్తూ రావడానికి గిరిజనల్లో అత్యధిక మందిని కన్వర్ట్ చేయడమే కాకుండా వారిని వైసీపీకి ఓటర్లుగా మార్చడంలో చర్చిలు కీలక పాత్ర పోషించాయి.
ఇప్పుడు బ్రదర్ అనిల్ జగన్ రెడ్డికి దూరమయ్యారు. ఆయన భార్య, జగన్ రెడ్డి సోదరి కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. కాంగ్రెస్ కోసం ఇప్పుడు బ్రదర్ అనిల్ చర్చిలను ప్రభావితం చేయడమే ఖాయమే. అందుకే జగన్ రెడ్డి విరుగుడుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల సోదరి విమలారెడ్డిని రంగంలోకి దించారు. వైజాగ్ దగ్గర రుషికొండ సమీపంలో అత్యంత ఖరీదైన స్థలాన్ని పొందిన ఆమె … కుటుంబంలో జగన్ రెడ్డి వైపు ఉంటున్నారు. వైఎస్ వినేకానందరెడ్డి హత్యను అయిపోయిందేదో అయిపోయింది సర్దుకోమని సలహాలిస్తున్నారు. వైఎస్ వివేకాపై చనిపోయిన తరవాత నిందలు కూడా వేశారు.
ఇప్పుడీమె కనుమ పండుగ రోజు తాడేపల్లిలో పాస్టర్ల సమావేశం పెట్టారు. ప్రభుత్వంపై.. జగన్ పై అసంతృప్తి ఉంటే పక్కన పెట్టేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలన్నారు. మనం ఏకం అయితే మిగతా వాళ్లంతా ఎలా తట్టుకోగలరని నూరి పోశారు. ఆమెను రాష్ట్రవ్యాప్తంగా చర్చిలు.. పాస్టర్ల వద్దకు పంపే అవకాశాలు ఉన్నాయి. బ్రదర్ అనిల్ కు విరుగుడుగా విమలారెడ్డిని జగన్ ప్రయోగిస్తున్నారని ఈ పరిణామాలతో స్పష్టమవుతుంది. మరి ఎవరిది పైచేయి అవుతుందో ?