వరంగల్ ఉప ఎన్నికలకు తెరాస తన అభ్యర్ధి పేరును ఖరారు చేసింది. గతంలో తెరాస యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పసునూరి దయాకర్ ని అభ్యర్ధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసారు. ఈరోజు రాత్రి లేదా రేపు దయాకర్ పేరును ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారు. పసునూరి దయాకర్ తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో, కేసీఆర్ చేపట్టిన తెలంగాణా ఉద్యమాలలో చాలా క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కి అత్యంత విశ్వాసపాత్రుడిగా మెలిగారు. అందుకు ప్రతిఫలంగానే ఆయనకు అరుదయిన ఈ అవకాశం దక్కిందని భావించవచ్చును. కేసీఆర్ మొదట జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలోరవికుమార్ ని అభ్యర్ధిగా నిలబెడదామని భావించారు కానీ కులం విషయంలో పార్టీ నేతలు కొందరు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వివాదరహితుడయిన పసునూరి దయాకర్ ని అభ్యర్ధిగా ఖరారు చేసారు.