రియల్ ఎస్టేట్ కూడా మిగతా అన్ని వస్తువుల్లా ధరలు ఎగుడు, దిగుడులకు గురయ్యే మార్కెట్టే. కానీ రోజువారీగా కాకుండా.. సీజన్‌ను బట్టి.. ప్రాంతాన్ని బట్టి.. ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఫలానా ప్రాంతంలో ధరలు తక్కువగా ఉన్నాయంటే అక్కడ డిమాండ్ ఉంటుంది. దాని అర్థం ధరలు ఎక్కువగా ఉన్న చోట్ల తక్కువగా ఉంటాయని కాదు. అది ఇంకా హాట్ కేక్ కాబట్టి.. అక్కడ పెట్టుబడులు పెట్టేవారు వేరే కేటగిరీలోకి వస్తారు. ఇలా హైదరాబాద్‌లోన అన్నివర్గాల ప్రజలూ కొనుక్కునేలా ఎక్కడో ఓ చోట ధరలు ఉంటాయి.
ప్రస్తుతం ఈ మూల నుంచి ఆ మూలకు అంటే.. హయాత్ నగర్, శంషాబాద్, మేడ్చల్, పటాన్ చెరు వైపు .. ఎక్కడెక్కడ ఎంత రేట్లు ఉన్నాయో సమగ్రమైన సమాచారం ఇది. ఇది స్థలాల ధరలు కాదు. ఆపార్టుమెంట్లలో అమ్మే స్క్వేర్ ఫీట్ల ధర.
పటాన్ చెరులో SFT రూ. 5000 నుంచి రూ. 7500
మియాపూర్‌లో SFT రూ. 7000 నుంచి రూ. 10000
కూకట్‌పల్లిలో SFT రూ. 6000 నుంచి రూ. 8000
గచ్చిబౌలిలో SFT రూ. 9000 నుంచి రూ. 11,999
తెల్లాపూర్‌లో SFT రూ. 6500 నుంచి రూ. 9500
కొంపల్లిలో SFT రూ. 6500 నుంచి రూ.8500
సికింద్రాబాద్‌లో SFT రూ. 5000 నుంచి రూ. 7000
ఉప్పల్‌లో SFT రూ. 6000 నుంచి రూ. 7999
ఎల్బీనగర్లో SFT రూ. 6000 నుంచి రూ. 8000
శంషాబాద్‌లో SFT రూ. 7000 నుంచి రూ. 11000
నార్సింగిలో SFT రూ. 8500 నుంచి రూ. 12000
నానక్ రామ్ గూడలో SFT రూ. 9000 నుంచి రూ. 12000
బంజారాహిల్స్‌లో SFT రూ. 10000 నుంచి రూ. 14000
మణికొండలో SFT రూ. 7000 నుంచి రూ. 9999
జూబ్లిహిల్స్‌లో SFT రూ. 9000 నుంచి రూ. 15999
ఈ రేట్లను బట్టి చూస్తే అతి తక్కువగా సికింద్రాబాద్ , పటాన్ చెరుల్లో స్క్వేర్ ఫీట్ ఐదు వేలకు లభిస్తున్నాయి. అంటే ఆయా ప్రాంతాల్లో ఓ వెయ్యి ఎస్ఎఫ్టీ అపార్టుమెంట్ ను యాభై లక్షలకు సొంతం చేసుకోవచ్చు. అత్యధికం జూబ్లిహిల్స్లోఉంది. అక్కడ ఎస్ఎఫ్టీ పదహారు వేలు అంటే వెయ్యి SFT చిన్న అపార్టుమెంట్ కు కూడా.. కోటి అరవై లక్షలు.. ఇతర ఎనిమిటీస్తో కలిపితే రెండు కోట్లు పెట్టుకోవాల్సి వస్తుంది.