దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘పఠాన్’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటుతున్నా, బాక్సాఫీస్ వద్ద సందడి ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం వెయ్యి కోట్లుపైగా కలెక్షన్లను సాధించినట్లు సినీ ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి.
తాజాగా పఠాన్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. మూడోవారంలో ఈ రికార్డ్ నమోదైయింది. ఈ రికార్డ్ ప్రేమికుల రోజు రూపంలో వచ్చింది. ఈ సినిమాకి వాలంటైన్స్ బాగా కలిసొచ్చింది. పఠాన్ వాలంటైన్స్ డే రోజున రూ.5.65కోట్లు సాధించింది. మూడోవారంలో ఓ భారతీయ సినిమా సింగిల్ డే హయ్యస్ట్ కలెక్షన్ ఇదే కావడం విశేషం.