ఆజ్ఞాతంలోకి వెళ్లానని తనపై ప్రచారం జరుగుతూడటంతో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ వీడియో విడుదలచేశారు. వైసీపీ నేతలు తమ ఇంటిపై దాడి చేసిన సమయంలో ఇంట్లో ఉన్న తన ఎనిమిదేళ్ల కూతురు భయాందోళనలకు గురైంది. మానసికంగా ఒత్తిడి గురైంది.. కుటంబ సభ్యుల ప్రశాంతత కోసమే తాను బయటకు వెళ్లానన్నారు. ఓ తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని ..త్వరలో వచ్చి మళ్లీ పార్టీలో అధికార ప్రతినిధిగా క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తాననని ప్రకటించారు.
డ్రగ్స్ వల్ల ఓ తరం నిర్వీర్యం అయిపోకుండా తెలుగుదేసం పార్టీ ఉద్యమం ప్రారంభించిందని అందులో తన వంతు పోరాటం చేస్తున్నానన్నారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని ఆరోపించారు. డ్రగ్స్ దందాపై తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక విధ్వంసానికి దిగారని మండిపడ్డారు. తనపై నమోదైన అ్ని కేసుల గురించి న్యాయస్థానాల్లో తేల్చుకోవాలనుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడినట్లుగా ఉన్న ఆ వీడియోలో తాను ఎక్కడికి వెళ్లానన్నది చెప్పలేదు కానీ.. బయటకు వెళ్లానని మాత్రం చెప్పారు. పట్టాభి విమానంలో వెళ్తున్న ఫోటోలను కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పట్టాభి వీడియో విడుదల చేసినట్లుగా చేసినట్లుగా తెలుస్తోంది.