ఎన్నికల ప్రచార భేరి ని తలపిస్తూ సాగుతున్న వై ఎస్ జగన్ సంకల్ప యాత్ర … లో పార్టీ అభ్యర్థులు సైతం ఖరారై పోతున్నారు.
కర్నూలు జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభ వైసీపీ ఎన్నికల హడావిడి కి మరో తార్కాణం గా నిలిచింది.
ఈ సభలో పత్తి కొండ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు చేశారు జగన్. ఫ్యాక్షన్ కక్షల్లో హత్యకు గురైన నారాయణరెడ్డి భార్య అయిన శ్రీదేవి కి వైసీపీ టిక్కెట్ ఖాయమని అందరూ అనుకున్నదే. అయితే… ఎన్నికల కు ఇంకా చాలా టైముండగానే బహిరంగంగా ప్రకటన చేయడంతో ఈ యాత్ర ముగిసేలోగా మరికొన్ని పేర్లు ఇదే విధంగా ఖరారు కావచ్చునని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
తద్వారా చివరి నిమిషంలో టిక్కెట్ల గొడవలు గందరగోళం వీలైనంత తగ్గించాలని అధినేత ఆలోచిస్తున్నట్టు కొందరు చెబుతున్నారు.