వైసీపీ అంటేనే బూతుల బ్రాండ్. ఎప్పుడో ఫిక్సయిపోయింది. వాళ్లపైన.. వీళ్లపైనే కాదు ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు.. వారి కుటుంబాలపైనా బూతులతో దాడి చేయడం కామన్ . ఆ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నో సార్లు స్వయంగా ఫేస్ చేశారు కూడా. కాకినాడ సిటీ ఎమ్మెల్యే దగ్గర్నుంచి అంబటి రాంబాబు వరకూ అందరూ బూతులు మాట్లాడారు. పవన్ కల్యాణ్ తమను ఎప్పుడు టార్గెట్ చేసినా … సాఫ్ట్‌గా స్పందిస్తూంటారు. మరోసారి అంటే ఊరుకునేది లేదంటారు. ఈ సారి కూడా అలాగే స్పందించారు. జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దారుణమైన భాషతో విరుచుకుపడ్డారు.
అవి ప్రసారం చేసిన టీవీ చానళ్లపై కేసులు పెట్టారు. ఇంత జరిగిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ బాలినేని గారూ మీ అనుచరులకు పద్దతులు నేర్పండి అంటూ ప్రకటన జారీ చేశారు. ఓ వైపు వైసీపీ నేతలు ఇంత దారుణంగా విరుచుకుపడుతూంటే .. పద్దతుల గురించి పవన్ మాట్లాడుతూండటంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మాటకు మాట అంటే తప్ప వాళ్లు తగ్గే అవకాశం కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే రియలైజ్ అయ్యారు. వాళ్లు ఒకటంటే.. అంతకు మించి అనడం ప్రారంభించారు. వైసీపీ నేతలు కేసులు పెట్టినా.. జేసీబీలతో ఇంటిపైకి విరుచుకుపడుతున్నా వెనక్కి తగ్గడం లేదు.
నాలుగు అంటూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పవన్ కల్యాణ్ పద్దతులు నేర్పాలని ప్రయత్నిస్తూండటం జనసేన వర్గాలకూ ఆశ్చర్యకరంగానే ఉంది. వైసీపీ నేతలు కొత్తగా గీత దాటడం లేదని.. గత మూడే్ళ్లుగా వారు అదే పని చేస్తున్నారని.. వారికి సాఫ్ట్‌గా సమాధానం చెబితే అది చేతకానితనంగా తీసుకుంటున్నారని… రివర్స్ పంచ్‌లు ఇవ్వాల్సిందేనన్న వాదన జనసైనికుల్లోనూ ఉంది. పవన్ కల్యాణ్ నుంచి ఆ ఫోర్స్ ను వారు ఆశిస్తున్నారు. కానీ జనసేన మాత్రం… పద్దతి.. పద్దతి అంటూనే ఉన్నారు.